1000 దాటిన కరోనా మరణాలు

చైనాలో కరోనా బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా మరణించిన వారి సంఖ్య 1016కు చేరింది. మరో 42,638 వేల మందికి వైరస్‌ సోకింది..........

Updated : 11 Feb 2020 12:32 IST

బీజింగ్‌: చైనాలో కరోనా బారిన పడి మృత్యువాత పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా మరణించిన వారి సంఖ్య 1016కు చేరింది. మరో 42,638 వేల మందికి వైరస్‌ సోకింది. ఒక్క సోమవారం రోజే 108 మంది ప్రాణాలొదిలారు. మరో 2,478 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్క హుబెయ్‌ ప్రావిన్సులోనే సోమవారం 103 మంది మృతిచెందారు. ఇక వైరస్ బారి నుంచి బయటపడి 3,996 మంది ఇళ్లకు చేరుకున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ముఖానికి మాస్క్‌ ధరించి సోమవారం బీజింగ్‌లో పర్యటించారు. ఇక్కడ ఏర్పాటుచేసిన ఓ శిబిరం వద్ద కరోనా వైరస్‌పై సన్నద్ధతను తొలిసారి స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన జ్వర పరీక్షలు చేయించుకున్నారు. హుబెయ్‌ ప్రావిన్సు ప్రజలకు సంఘీభావంగా యావత్‌ చైనా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. జిన్‌పింగ్‌ క్షేత్రస్థాయికి రావడం ఇదే తొలిసారి.

ప్రాణాంతక కొత్త తరహా కరోనా వైరస్‌ బారినపడ్డ కేరళకు చెందిన విద్యార్థిని కోలుకుంది. ఆమెలో వైరస్‌ లేదని తాజా పరీక్షల్లో తేలింది. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్య వర్గాలు తెలిపాయి. చైనా నుంచి వచ్చిన ముగ్గురు కేరళ విద్యార్థులకు కరోనా వైరస్‌ సోకినట్లు గతంలో నిర్ధారణ అయింది. అప్పటి నుంచి వారిని విడిగా ఉంచి చికిత్స అందిస్తున్నారు. 

ఇవీ చదవండి:

చైనాలో ఫ్యాక్టరీలు కూత కూయట్లేదు

కరోనా ప్రభావం: హోటళ్లకు దడ


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts