మోదీపై జిన్‌పింగ్‌ ప్రశంసలు..

ప్రధాని మోదీని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ప్రశంసించారు. కరోనా వైరస్‌ ఎదుర్కొనేందుకు భారత్‌ తరఫున సహాయ సహకారాలు అందిస్తామని మోదీ రాసిన లేఖకు చైనా........

Published : 11 Feb 2020 14:18 IST

బీజింగ్‌: ప్రధాని మోదీని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ప్రశంసించారు. కరోనా వైరస్‌ ఎదుర్కొనేందుకు భారత్‌ తరఫున సహాయ సహకారాలు అందిస్తామని మోదీ రాసిన లేఖకు చైనా ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది. కరోనా వైరస్ పోరాటంలో చైనాకు సహకరిస్తామన్న ఇండియాకు ధన్యవాదాలంటూ ప్రత్యుత్తరంలో పేర్కొంది. ఇది భారత్‌-చైనా బంధానికి ప్రతిబింబమని జిన్‌పింగ్‌ కొనియాడినట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. కరోనా వైరస్‌తో వణికిపోతున్న చైనాకు అండగా ఉంటామంటూ మోదీ సంఘీభావం తెలిపారు. మహమ్మారిపై పోరుకు అవసరమైన సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామంటూ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు లేఖ రాశారు. కరోనా వైరస్ వల్ల చనిపోయిన వారికి మోదీ సంతాపం ప్రకటించారు. హుబెయ్ ప్రావిన్సులోని భారతీయులను తరలించడానికి చైనా అధికారులు అందజేసిన సహకారాన్ని మోదీ లేఖలో ప్రశంసించారు.

ఇవీ చదవండి: 1000 దాటిన కరోనా మరణాలు

                    చైనాకు ప్రపంచం చేయూత

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని