చైనాకు ఆర్థిక సాయం చేయలేం

వాషింగ్టన్‌: కరోనావైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో చైనాకు సహాయాన్ని అందించండంలో ప్రపంచవ్యాప్తంగా మిశ్రమ స్పందన వస్తోంది. కొన్ని దేశాలు చైనాకు సహాయం అందిస్తామని ప్రకటిస్తుండగా మరికొన్ని మాత్రం ప్రతికూలంగా స్పందిస్తున్నాయి.

Updated : 11 Feb 2020 19:34 IST

కేవలం సాంకేతిక సహాయం మాత్రమే అందిస్తామని ప్రపంచ బ్యాంకు ప్రకటన

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌తో విలవిలలాడుతున్న చైనాకు సహాయాన్ని అందించండంపై ప్రపంచవ్యాప్తంగా మిశ్రమ స్పందన వస్తోంది. కొన్ని దేశాలు చైనాకు సాయం అందిస్తామని ప్రకటిస్తుండగా మరికొన్ని మాత్రం ప్రతికూలంగా స్పందిస్తున్నాయి. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు తాజాగా ప్రపంచ బ్యాంకు కూడా చైనాకు సాయం చేస్తామని ప్రకటించింది. అయితే అది కేవలం సాంకేతిక అంశాల్లో మాత్రమే అని తెలిపింది. ఆరోగ్య సంక్షోభాల నుంచి ఎలా బయటపడాలనే అంశంపై సలహాలు ఇస్తామని పేర్కొంది. 

ఆర్థిక సహాయం అందించే ఆలోచన లేదని..దీనికి ప్రత్యేకంగా ఎలాంటి రుణాలు మంజూరు చేయడం లేదని ప్రపంచబ్యాంకు అధ్యక్షుడు డేవిడ్‌ మాల్‌పాస్‌ ప్రకటించారు. ఆ దేశానికి ఉన్న విస్తృత ఆర్థిక వనరుల దృష్ట్యా తాము ఈ నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొన్నారు. ఆ దేశానికి సహాయం అందిచడంలో భాగంగా ఇప్పటికే తమ బ్యాంకు ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి పనిచేస్తోందని చెప్పారు.  

ఇదిలా ఉండగా...వుహాన్‌లో కరోనా విజృంభిస్తున్న సమయంలో స్థానికంగా సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకు ఇద్దరు స్థానిక అధికారులపై చైనా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు చైనా మీడియా తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని