ఉచిత విద్యుత్‌ను ప్రకటించిన దీదీ ప్రభుత్వం

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో పేదలకు వరాలు కురిపించింది. పేదలకు ఉచిత విద్యత్‌ను ప్రకటించింది. అయితే అది కేవలం మూడునెలల్లో 75 యూనిట్ల వరకు వినియోగించే వారికి మాత్రమే ఉచితంగా కరెంటు ఇస్తామని ప్రకటించింది. 

Published : 12 Feb 2020 00:46 IST

మూడు నెలల్లో 75 యూనిట్లు వినియోగించే వారు అర్హులని ప్రకటన

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో పేదలకు వరాలు కురిపించింది. పేదలకు ఉచిత విద్యుత్‌ను ప్రకటించింది. అయితే అది కేవలం మూడునెలల్లో 75 యూనిట్ల వరకు వినియోగించే వారికి మాత్రమే ఉచితంగా కరెంటు ఇస్తామని వెల్లడించింది. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించారు.

2020-21సంవత్సర బడ్జెట్‌ను రెండు లక్షల 55వేల కోట్ల రూపాయల అంచనాలతో ప్రవేశపెట్టారు. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ పార్కులు, ఉద్యోగ కల్పనలకోసం దాదాపు ఐదువేల కోట్లు కేటాయించారు. ఓవైపు రాష్ట్రంలో పాగా వేయడానికి భాజపా ప్రయత్నిస్తుండగా మమతా మాత్రం తన మార్కు రాజకీయాలతో సామాన్యులకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా పెట్టిన బడ్జెట్‌తో ఇది స్పష్టంగా కనిపించిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వచ్చే సంవత్సరం జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్‌ ఇదే కావడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని