గిరిరాజ్‌సింగ్‌ అనుచిత వ్యాఖ్యలు

సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నిరసనకారులనుద్దేశించి కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌ జిల్లాలో దేవ్‌బంద్‌ పట్టణం....

Published : 13 Feb 2020 01:13 IST

సహరన్‌పూర్‌: సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నిరసనకారులనుద్దేశించి కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌ జిల్లాలో దేవ్‌బంద్‌ పట్టణం ఉగ్రవాద ముఠాల అడ్డాగా అభివర్ణించారు. హఫీజ్‌ సయీద్ వంటి ఉగ్రవాదులు అక్కడి నుంచే వచ్చారన్నారు. సహరన్‌పూర్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘సీఏఏపై కొంత మందికి అవగాహన కల్పించలేం. ఎందుకంటే వారంతా దేవ్‌బంద్‌కు చెందినవారు. సీఏఏ వ్యతిరేకులు, ఉగ్రవాదులు. ప్రంపంచలోని పెద్ద ఉగ్రవాదులందరూ ఇక్కడే జన్మించారు. గతంలో కూడా దేవ్‌బంద్‌ ఉగ్రవాద ముఠాల అడ్డా అని చెప్పాను. హఫీజ్‌ సయీద్ వంటి ఉగ్రవాదులు ఇక్కడి నుంచే వచ్చారు’’ అని అన్నారు.

గతంలో షాహీన్‌బాగ్ నిరసనలను ఉద్దేశిస్తూ.. అది ఆత్మాహుతి దళాలను పెంపొందిస్తున్న కేంద్రంగా మారిందని ఆరోపించారు. సీఏఏ నిరసనలను ఖిలాఫత్‌ ఉద్యమంతో పోల్చారు. జనవరి 27 నుంచి దేవ్‌బంద్‌లోని ఈద్గా మైదానంలో అక్కడి మహిళలు సీఏఏకి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. నిరసన విరమించాలని అభ్యర్థించేందుకు వెళ్లిన అధికారులను సైతం మహిళలు ‘గో బ్యాక్‌’ అంటూ నినాదాలు చేస్తూ వారిపై చేతి గాజులు విసిరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని