వంటగ్యాస్‌ ధర పెంపు

వంటగ్యాస్‌ ధర ఒకేసారి రూ.144.5 పెరిగింది. దీంతో రూ.714గా ఉన్న ఒక్క సిలిండర్‌ ధర రూ.858కు చేరింది. అయితే కేంద్రం ఇచ్చే రాయితీకి కూడా పెంచడం గమనార్హం..........

Updated : 12 Feb 2020 17:45 IST

దిల్లీ: వంటగ్యాస్‌ ధర ఒకేసారి రూ.144.5 పెరిగింది. దీంతో రూ.714 గా ఉన్న ఒక్క సిలిండర్‌ ధర రూ.858కు చేరింది. అయితే కేంద్రం ఇచ్చే రాయితీ కూడా పెంచడం గమనార్హం. గతంలో ఇచ్చిన రూ.153.86 రాయితీని రూ.291.48కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు రాయితీని రూ.174.86 నుంచి రూ.312.48కు పెంచింది.

2014 జనవరి తర్వాత వంటగ్యాస్‌ ధరలు ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు మార్పే తాజా ధరల పెంపునకు కారణమని సమాచారం. సాధారణంగా ప్రతి నెల ఒకటో తారీఖున ధరల్ని సమీక్షిస్తుంటారు. కానీ, ఈసారి దాదాపు రెండు వారాలు ఆలస్యం అయింది. రాయితీని భారీగా పెంచుతున్న కారణంగా అనుమతుల ప్రక్రియలో జాప్యం జరిగిందని అధికారులు తెలిపారు. అయితే దిల్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ధరల పెంపును వాయిదా వేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు