జపాన్‌ నౌకలో ఇద్దరు భారతీయులకు కొవిడ్‌

జపాన్‌లోని యొకొహమా పోర్టులో నిలిపివేసిన ‘డైమండ్‌ ప్రిన్సెస్‌’ ఓడలో ఇద్దరు భారతీయులు ‘కొవిడ్‌-19’ (కరోనా వైరస్‌) బారిన పడ్డారు. ఓడలో ఉన్న భారతీయ సిబ్బందికి కరోనా పరీక్షలు......

Published : 12 Feb 2020 20:39 IST

టోక్యో: జపాన్‌లోని యొకొహమా పోర్టులో నిలిపివేసిన ‘డైమండ్‌ ప్రిన్సెస్‌’ ఓడలో ఇద్దరు భారతీయులు ‘కొవిడ్‌-19’ (కరోనా వైరస్‌) బారిన పడ్డారు. ఓడలో ఉన్న భారతీయ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఇద్దరికి పాజిటివ్‌గా తేలినట్లు జపాన్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు ఓడలో ఉన్నవారిలో మొత్తం 174 మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలినట్లు తెలిపారు. ఫిబ్రవరి 19 వరకు అందులోని వారికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారని పేర్కొంది. 

ఇప్పటికే అందులో చెఫ్‌గా పనిచేస్తున్న భారతీయుడు వినయ్‌ కుమార్‌ సహా మరో యువతి తమను రక్షించాలని భారత ప్రభుత్వానికి సామాజిక మాధ్యమాల ద్వారా విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. దీనిపై రాయబార కార్యాలయం స్పందిస్తూ.. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, తప్పకుండా బయటికి తీసుకువస్తామని హామీ ఇచ్చింది. 

కొవిడ్‌-19 వ్యాప్తి కారణంగా జపాన్‌కు చెందిన విహార నౌక ‘డైమండ్‌ ప్రిన్సెస్‌’లో నుంచి హాంగ్‌కాంగ్‌లో దిగిన ఓ వ్యక్తికి కరోనా గుర్తించారు. దీంతో ఫిబ్రవరి 3 నుంచి ఆ నౌకను యొకొహమా పోర్టులోనే నిలిపివేశారు. ఆ ఓడలో మొత్తం 3700 మంది ప్రయాణికులు ఉండగా అందులో 138 మంది భారతీయ ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు.

ఇదీ చదవండి..
1,110కి చేరిన కొవిడ్‌-19 మృతులు

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని