మోదీ మీ ఆహ్వానానికి ధన్యవాదాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ త్వరలో భారత్ పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ పర్యటనకు సంబంధించి అమెరికా ప్రథమ మహిళ, ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్‌ ట్వీట్ చేశారు....

Updated : 24 Feb 2020 09:58 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ త్వరలో భారత్ పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనపై అమెరికా ప్రథమ మహిళ, ట్రంప్ సతీమణి మెలానియా ట్విటర్‌ వేదికగా స్పందించారు. భారత్ పర్యటన కోసం అధ్యక్షుడు ట్రంప్‌, తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ‘ప్రధాని మోదీ మీ ఆహ్వానానికి ధన్యవాదాలు. అహ్మదాబాద్, దిల్లీలో పర్యటించేందుకు ప్రెసిడెంట్ ట్రంప్‌, నేను సంతోషంగా ఎదురుచూస్తున్నాం. అమెరికా, భారత్‌ల సత్సంబంధాన్ని వేడుకలా జరుపుకుందాం’’ అని ఆమె ట్వీట్ చేశారు.

ట్రంప్‌నకు అదిరిపోయే స్వాగతం పలుకుతామని ప్రధాని మోదీ నిన్న ట్విటర్‌ వేదికగా హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ‘ఈ నెల చివర్లో అమెరికా అధ్యక్షుడు, ఆయన సతీమణి మెలానీయా భారత్ పర్యటనకు వస్తుండటం చాలా సంతోషంగా ఉంది. మన అపూర్వ అతిథులకు భారత్ ఎప్పటికీ గుర్తిండిపోయే ఆహ్వానాన్ని పలుకుతుంది. ఈ పర్యటన చాలా ప్రత్యేకమైనది’ అని ట్వీట్ చేశారు. డొనాల్డ్‌ ట్రంప్‌ తొలిసారిగా భారత పర్యటనకు రానున్నారు. భార్య మెలానియాతో కలిసి ఫిబ్రవరి 24, 25 తేదిల్లో అహ్మదాబాద్, దిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు దోహపడుతుందని శ్వేత సౌధం ఒక ప్రకటనలో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని