బ్రిటన్‌ ఆర్థికమంత్రిగా నారాయణమూర్తి అల్లుడు

బ్రిటన్‌ నూతన ఆర్థిక మంత్రిగా భారత సంతతి వ్యక్తి రిషి సునక్‌ గురువారం నియామకం అయ్యారు. ప్రస్తుత ఆర్థిక మంత్రి సజిద్‌ జావిద్‌ తన పదవికి రాజీనామా చేయడంతో.. రిషిని తన కేబినెట్లోకి తీసుకుంటున్నట్లు బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రకటించారు.

Updated : 13 Feb 2020 21:19 IST

లండన్‌: బ్రిటన్‌ నూతన ఆర్థిక మంత్రిగా భారత సంతతి వ్యక్తి, ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్‌ గురువారం నియామకం అయ్యారు. ప్రస్తుత ఆర్థిక మంత్రి సజిద్‌ జావిద్‌ తన పదవికి రాజీనామా చేయడంతో రిషిని తన కేబినెట్లోకి తీసుకుంటున్నట్లు బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రకటించారు. రిషి సునక్‌ ప్రస్తుతం ట్రెజరీ విభాగానికి ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. 

భారత సంతతికి చెందిన 39 ఏళ్ల రిషి సునక్‌.. ఇంగ్లాండ్‌లో హాంప్‌షైర్‌ కౌంటీలో జన్మించారు. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి.. 2014లో రాజకీయాల్లోకి వచ్చారు. 2015లో జరిగిన ఎన్నికల్లో యార్క్‌షైర్‌లోని రిచ్‌మాండ్‌ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. గతంలో థెరిసా మే ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీలో ఎంబీఏ చదివే రోజుల్లో సహ విద్యార్థిని అయిన నారాయణమూర్తి కుమార్తె అక్షతా మూర్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని