‘శ్రీనివాస గౌడకు బంగారుపతకం ఇవ్వాలి’

జమైకా పరుగుల వీరుడు ఉసేన్‌ బోల్ట్‌ను మించిన వేగంతో పరిగెత్తి అందరి దృష్టిని ఆకర్షించిన శ్రీనివాస గౌడపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అతడికి ప్రభుత్వం శిక్షణ ఇచ్చి ఒలింపిక్స్‌కు పంపించాలంటూ

Updated : 15 Feb 2020 15:11 IST

ఆనంద్‌ మహీంద్రా కోరిక.. స్పందించిన కేంద్రమంత్రి

ఇంటర్నెట్‌డెస్క్‌: జమైకా పరుగుల వీరుడు ఉసేన్‌ బోల్ట్‌ను మించిన వేగంతో పరుగెత్తి అందరి దృష్టిని ఆకర్షించిన శ్రీనివాస గౌడపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అతడికి ప్రభుత్వం శిక్షణ ఇచ్చి ఒలింపిక్స్‌కు పంపించాలంటూ పలువురు సూచిస్తున్నారు. తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా కూడా ఈ విషయాన్ని కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు దృష్టికి తీసుకెళ్లారు. 

‘అతడి శరీర దారుఢ్యాన్ని ఒక్కసారి చూడండి. అథ్లెటిక్స్‌లో విజయాలు సాధించే అసాధారణ సామర్థ్యం అతడికి ఉంది. అందుకే అతడికి 100మీటర్ల స్ప్రింట్‌లో శిక్షణ కల్పించేలా కిరణ్‌ రిజిజు చూడాలి. లేదా కంబళ క్రీడను ఒలింపిక్‌లో చేర్చేలా ప్రయత్నాలు చేయాలి. దీంతో పాటు శ్రీనివాసకు బంగారు పతకం కూడా ఇవ్వాలి’ అని ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ చేశారు.

శాయ్‌కి పిలిపిస్తాం: రిజిజు

కాగా.. మహీంద్రా ట్వీట్‌కు కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు స్పందించారు. శ్రీనివాసను శాయ్‌కు పిలిపిస్తామని హామీ ఇచ్చారు. ‘అథ్లెటిక్స్‌కు సంబంధించి ఒలింపిక్స్‌ ప్రమాణాలపై చాలా మందికి సరైన అవగాహన ఉండదు. శారీరక దృఢత్వం, ఓర్పు చాలా అవసరం. ట్రయల్స్‌ కోసం శ్రీనివాస గౌడను శాయ్‌ కోచ్‌ల వద్దకు పంపిస్తాం. దేశంలో ప్రతిభ కలిగిన వ్యక్తులను ఎప్పటికీ వదులుకోబోం’ అని రిజిజు ట్విటర్‌లో పేర్కొన్నారు. 

అటు బాలీవుడ్‌ నటుడు సునిల్‌ శెట్టి కూడా శ్రీనివాస గౌడపై ప్రశంసలు కురిపించారు. ‘ఆ పనికి(పరుగెత్తడం) ఇంతకంటే మెరుగైన వ్యక్తి కన్పించడు. ఇలాంటి వ్యక్తులు మరింత మంది కావాలి. మీకు(కిరణ్‌ రిజిజును ఉద్దేశిస్తూ) మరిన్ని అధికారాలు ఉండాలి సర్‌’ అని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి..

బోల్ట్‌ను తలపించేలా! 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని