కశ్మీర్‌ గురించి మీరేం బాధపడకండి: జైశంకర్‌

కశ్మీర్‌ అంశంలో తలదూర్చిన ఓ అమెరికన్‌ సెనెటర్‌కు భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌ ఇచ్చిన ఘాటు సమాధానం ఇచ్చారు. అమెరికాకు చెందిన సెనెటర్‌ లిండ్సే గ్రాహమ్‌.. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు అత్యంత సన్నిహితురాలు.

Published : 16 Feb 2020 00:36 IST

బెర్లిన్‌: కశ్మీర్‌ అంశంలో తలదూర్చిన ఓ అమెరికన్‌ సెనెటర్‌కు భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌ ధీటైన సమాధానం ఇచ్చారు. అమెరికాకు చెందిన సెనెటర్‌ లిండ్సే గ్రాహమ్‌.. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు అత్యంత సన్నిహితురాలు కూడా. ఆమె తాజాగా జర్మనీలోని మ్యూనిచ్ నగరంలో భద్రతకు సంబంధించి నిర్వహించిన సమావేశంలో కశ్మీర్‌ ప్రస్తావన లేవనెత్తారు. దీంతో విదేశాంగ మంత్రి జైశంకర్‌ తనదైన శైలిలో ఆమెకు బదులిచ్చారు. 

సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ‘కశ్మీర్‌ విషయానికి వస్తే.. అదెలా ముగుస్తుందో నాకు తెలియదు. కానీ రెండు దేశాల్లో ఏదో ఒకటి తొందరగా ఈ అంశాన్ని పరిష్కారం దిశగా తీసుకెళ్లాలి’ అంటూ లిండ్సే పేర్కొన్నారు. దీనిపై జైశంకర్‌ బదులిస్తూ.. ‘కశ్మీర్‌ గురించి మీరేం బాధపడకండి సెనెటర్‌.. ఆ అంశాన్ని ఒకే దేశం పరిష్కరిస్తుంది. ఆ దేశం ఏదో మీకు కూడా తెలుసు’ అంటూ పరోక్షంగా ఆమెకు ఘాటు సమాధానమిచ్చారు. దీంతో నెటిజన్లు జైశంకర్‌ సమాధానికి ఫిదా అయ్యారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని గతేడాది ఆగస్టులో రద్దు చేసిన విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని