రన్‌వేపై జీపు, మనిషిని తప్పించబోయి..

మహారాష్ట్రలోని పుణె విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. దిల్లీకి వెళ్తున్న ఓ ఎయిరిండియా విమానం టేకాఫ్‌ అవుతుండగా అకస్మాత్తుగా రన్‌వేపైకి వచ్చిన జీపు, మనిషిని గుర్తించాడు పైలట్‌. దీంతో జీపు, మనిషిని

Published : 15 Feb 2020 19:35 IST

ధ్వంసమైన విమానం, తప్పిన పెను ప్రమాదం

దిల్లీ: మహారాష్ట్రలోని పుణె విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. దిల్లీకి వెళ్తున్న ఓ ఎయిరిండియా విమానం టేకాఫ్‌ అవుతుండగా అకస్మాత్తుగా రన్‌వేపైకి వచ్చిన జీపు, మనిషిని గుర్తించాడు పైలట్‌. దీంతో జీపు, మనిషిని తప్పించేందుకు ఒక్కసారిగా విమానాన్ని పైకి లేపాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ క్రమంలో విమానం వెనుక భాగం ధ్వంసమైంది. శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. 

‘విమానం 120 నాట్ల(గంటకు 222 కిలోమీటర్లు) వేగంతో టేకాఫ్‌ అవుతుండగా రన్‌వేపై జీపు, మనిషి ఉండటాన్ని సిబ్బంది గుర్తించారు. వారిని ఢీకొట్టకుండా ఉండేందుకు అంత వేగంలోనూ విమానాన్ని షెడ్యూల్‌ కంటే ముందుగా పైకి లేపారు. దీంతో విమానం తోక భాగం రన్‌వేపై రాపిడికి గురై ధ్వంసమైంది’ అని డీజీసీఏ అధికారులు తెలిపారు. అయితే ధ్వంసమైనప్పటికీ పైలట్‌ విమానాన్ని అలాగే దిల్లీకి తీసుకొచ్చారు. అదృష్టవశాత్తు దిల్లీ విమానాశ్రయంలో విమానం సురక్షితంగా దిగినట్లు అధికారులు వెల్లడించారు.

ఘటనపై డీజీసీఏ దర్యాప్తునకు ఆదేశించింది. విచారణ నిమిత్తం విమానాన్ని సర్వీసు నుంచి ఉపసంహరించినట్లు డీజీసీఏ  అధికారి తెలిపారు. దర్యాప్తులో పుణె ఏటీసీకు సహకరించాలని ఎయిరిండియాను సూచించినట్లు చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని