యెమెన్‌లో సౌదీ వైమానిక దాడి: 31 మంది మృతి

 సౌదీ నేతృత్వంలోని దళాలు యెమెన్‌పై వైమానిక దాడికి దిగాయి. జెట్‌ విమానాన్ని కూల్చడంతో 31 మంది పౌరులు మృతిచెందారు. ఈ ఘటనలో 12 మంది గాయపడ్డట్లు సమాచారం. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి ధ్రువీకరించింది. ఈ ఘటన యెమెన్‌ ఉత్తర ప్రావిన్స్‌లోని అల్‌

Updated : 17 Oct 2022 15:07 IST

యెమెన్‌: సౌదీ నేతృత్వంలోని దళాలు యెమెన్‌పై వైమానిక దాడికి దిగాయి. జెట్‌ విమానాన్ని కూల్చడంతో 31 మంది పౌరులు మృతిచెందారు. ఈ ఘటనలో 12 మంది గాయపడ్డట్లు సమాచారం. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి ధ్రువీకరించింది. ఈ ఘటన యెమెన్‌ ఉత్తర ప్రావిన్స్‌లోని అల్‌ జాఫ్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. హౌతీ తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉన్న పలు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరిగినట్లు సమాచారం. అయితే అంతకుముందు రోజు యెమెన్‌లో సౌదీ జెట్‌ కూలిపోయింది. సౌదీ జెట్‌ను తామే కూల్చినట్లు హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ప్రతీకారంగానే ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై సౌదీ ఇంత వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని