అమెరికా ఆస్తులే లక్ష్యంగా మరోసారి దాడి!

ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం లక్ష్యంగా మరోసారి రాకెట్‌ దాడులు జరిగాయి. ఈ విషయాన్ని అమెరికా రక్షణ విభాగం అధికారం శనివారం స్వయంగా వెల్లడించారు..........

Updated : 16 Feb 2020 14:54 IST

బాగ్దాద్‌: ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం లక్ష్యంగా మరోసారి రాకెట్‌ దాడులు జరిగాయి. ఈ విషయాన్ని అమెరికా రక్షణ విభాగ అధికారులు స్వయంగా వెల్లడించారు. గతేడాది అక్టోబరు నుంచి అమెరికా ఆస్తులపై దాడులు జరగడం ఇది 19వ సారి అని తెలిపారు. ఎన్ని రాకెట్లతో దాడి జరిగింది.. ఈ ఘటనలో ఎంతమంది గాయపడ్డారు అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఘటనకు బాధ్యతవహిస్తూ ఇప్పటి వరకు ఎవరూ ప్రకటన చేయలేదు. అగ్రరాజ్యం మాత్రం ఇరాన్‌ మద్దతుదారుల పనే అని ఆరోపిస్తోంది. ఇరాన్‌ అగ్రశ్రేణి కమాండర్‌ జనరల్‌ ఖాసీం సులేమానీని అమెరికా చంపిన తర్వాత పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని