రష్యాలో చైనీయులకు నో ఎంట్రీ..!

మాస్కో: కొవిడ్‌-19(కరోనా వైరస్‌)తో వణికిపోతున్న చైనీయులను తమ దేశాల్లోకి రానివ్వకుండా ఇప్పటికే పలు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా రష్యా కూడా ఈ జాబితాలోకి చేరింది. చైనా దేశీయులను తమ దేశంలోకి అనుమతించమని ప్రధాని మిఖాయిల్‌ మిశుస్టిన్‌ తాజాగా ఈ నిర్ణయంపై సంతకం చేశారని ఆదేశ ఉపప్రధాని టటైనా గోలికోవా ప్రకటించారు.

Published : 19 Feb 2020 14:27 IST

వైరస్‌ విజృంభణతో నిర్ణయం తీసుకున్న రష్యా

మాస్కో: కొవిడ్‌-19(కరోనా వైరస్‌)విజృంభణ కారణంగా చైనీయులను తమ దేశాల్లోకి రానివ్వకుండా ఇప్పటికే పలు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా రష్యా కూడా ఈ జాబితాలోకి చేరింది. చైనా దేశీయులను తమ దేశంలోకి అనుమతించకుండా ప్రధాని మిఖాయిల్‌ మిశుస్టిన్‌ తాజాగా ఈ నిర్ణయంపై సంతకం చేశారని రష్యా ఉపప్రధాని టటైనా గోలికోవా ప్రకటించారు. తమ దేశంలోకి వచ్చే చైనా పర్యాటకులు, విద్యార్థులు, పని వీసాలతో వచ్చే వారికి ఈ నిషేధం వర్తిస్తుందని వెల్లడించారు. అయితే, ఈ నిషేధం రష్యా విమానాశ్రయాల మీదుగా ప్రయాణం చేసే వారికి వర్తించదని పేర్కొన్నారు. కొవిడ్‌ తమ దేశంలో వ్యాపించకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలియజేశారు. దీనిలో భాగంగా ఇప్పటికే చైనా, ఉత్తర కొరియాలకు విమానాలు, రైళ్ల రాకపోకలను నియంత్రించడంతోపాటు చైనా పౌరులకు వర్క్‌ వీసా జారీ చేయడాన్ని నిలిపివేసింది. రష్యాలో చదువుకునే చైనా విద్యార్థులను మార్చి వరకూ రాకూడదని ఇప్పటికే సూచించింది. 

చైనాలో ఈ వైరస్‌ కారణంగా 2వేల మంది మరణించగా..దాదాపు 74వేల మంది ఈ వైరస్‌ బారినపడ్డ విషయం తెలిసిందే. ఈ నేఫథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు రష్యా అధికారులు వెల్లడించారు. మాస్కో సమయం ప్రకారం గురువారం రాత్రి 9గంటల నుంచి ఈ నిషేధం అమలులోకి వస్తుందని వెల్లడించారు. అయితే ఈ నిషేధం తాత్కాలికమేనని పేర్కొన్నారు. రష్యాతో సుదూర సరిహద్దు కలిగిన చైనా, మంగోలియా ప్రాంతాల్లో ఇప్పటికే ఆంక్షలు ఉన్నాయి. రష్యాలో ఇప్పటికి మూడు కొవిడ్‌ పాజిటీవ్‌ కేసులు నమోదయ్యాయి. వారిలో ఇద్దరు చైనీయులు చికిత్సానంతరం కోలుకోగా, రష్యాకే చెందిన మరో వ్యక్తి జపాన్‌లో నిలిపి ఉంచిన నౌకలో చికిత్స పొందుతున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని