అఫిడవిట్‌ కేసులో ఫడణవీస్‌కు బెయిల్‌

ఎన్నికల అఫిడవిట్‌ వ్యవహారంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్‌కు ఊరట లభించింది. ఈ కేసులో ఫడణవీస్‌ నేడు నాగ్‌పూర్‌ కోర్టు ఎదుట హాజరవగా..

Published : 20 Feb 2020 15:56 IST

నాగ్‌పూర్‌: ఎన్నికల అఫిడవిట్‌ వ్యవహారంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్‌కు ఊరట లభించింది. ఈ కేసులో ఫడణవీస్‌ నేడు నాగ్‌పూర్‌ కోర్టు ఎదుట హాజరవగా.. న్యాయస్థానం ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది.  

2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫడణవీస్‌ తనపై ఉన్న క్రిమినల్‌ కేసుల వివరాలను అఫిడవిట్‌లో వెల్లడించలేదని.. ఆయనపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాది సతీశ్‌ ఉకే బాంబే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఈ కేసులో ఫడణవీస్‌ విచారణ ఎదుర్కోవాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.   

ప్రస్తుతం దీనిపై నాగ్‌పూర్‌ కోర్టులో విచారణ జరుగుతోంది. అయితే ఫడణవీస్‌కు గతంలో నాలుగు సార్లు కోర్టు హాజరు నుంచి మినహాయింపు కల్పించిన న్యాయస్థానం.. ఈసారి తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టం చేసింది. దీంతో నేడు ఆయన కోర్టు ఎదుట హాజరయ్యారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఫడణవీస్‌కు రూ. 15000 వ్యక్తిగత పూచికత్తుపై బెయిల్‌ మంజూరు చేసింది. తదుపరి విచారణను మార్చి 30కి వాయిదా వేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని