ఆ తీర్పుతో మరింత క్లారిటీ వచ్చింది:ఆర్మీచీఫ్
సైన్యంలో మహిళా అధికారులకు ‘కమాండ్ హోదా’ను ఇచ్చేలా మార్గం సుగమమం చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సైన్యాధిపతి నరవాణే స్వాగతించారు. పార్ట్ సర్వీస్ కమిషన్ మహిళా.......
సైన్యంలో ఎవరిపట్లా వివక్ష ఉండదన్న నరవణె
దిల్లీ: సైన్యంలో మహిళా అధికారులకు ‘కమాండ్ హోదా’ను ఇచ్చేలా మార్గం సుగమం చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును భారత సైన్యాధిపతి నరవాణే స్వాగతించారు. పార్ట్ సర్వీస్ కమిషన్ మహిళా అధికారులందరికీ శాశ్వత కమిషన్ మంజూరు చేయాలన్న సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో సైన్యం మరింత బలోపేతమవుతుందన్నారు. లింగ సమానత్వం పాటించే విషయంలో సైన్యం ఇప్పటికే ముందుందన్న ఆయన.. తాజాగా తీర్పుతో ఈ విషయంలో ముందుకెళ్లేందుకు తమకు మరింత స్పష్టత వచ్చిందని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం పనిచేయడమే తమ తొలి ప్రాధాన్యమన్నారు. సుప్రీం ఆదేశాలను పాటించేలా రోడ్‌మ్యాప్ సిద్ధం చేయనున్నట్టు చెప్పారు. కులం, మతం, వర్గం, లింగబేధం తదితర అంశాల్లో ఏ సైనికుడి పట్లా వివక్షత ఉండబోదని స్పష్టంచేశారు. 1993 నుంచే సైన్యంలోకి మహిళా అధికారులను సైన్యంలోకి ఎంపికచేయడం ప్రారంభించామన్నారు. పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు కల్పించేలా తొలి బ్యాచ్‌లో 100 మంది మహిళలతో మిలటరీ పోలీస్ సెంటర్, పాఠశాలలో శిక్షణ ప్రారంభించినట్టు చెప్పారు.
దేశానికి సేవచేయాలనే విషయంలో మహిళలు, పురుషులకు సమాన అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడుల ఘటనలు తగ్గుతున్నాయని చెప్పారు. ఉగ్ర గ్రూపులపై సైన్యం ఒత్తిడి పెంచిందని చెప్పారు. సరిహద్దు ఉగ్రవాదం తగ్గడానికి బాహ్యకోణం కూడా ఉందని ఎఫ్ఏటీఎఫ్ ప్లీనరీ జరుగుతున్న నేపథ్యంలో నరవణె వ్యాఖ్యానించారు. ఆప్తమిత్రుడిగా ఉన్న చైనా ఎల్లకాలం ఆదుకోలేమని పాక్ గ్రహించిందనీ.. ఇప్పటికైనా పాకిస్థాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడాన్ని మానుకోవాలని హితవు పలికారు. ఉగ్రవాద నిరోధక చర్యలు పాటించడంలో పాక్ విఫలమవుతోంది గనకే ఎఫ్ఏటీఎఫ్ మళ్లీ గ్రే లిస్ట్‌లోనే ఉంచిందని చెప్పారు. కశ్మీర్లో ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే సమర్థతతో భద్రతాదళాలు ఉన్నాయని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది ‘రాజకీయ ప్రతీకారమే’ - ఆప్
దేశ రాజధానిలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది ‘రాజకీయ ప్రతీకారమే’ అని స్పష్టంగా అర్థమవుతుందని ఆమ్ఆద్మీ పార్టీ పేర్కొంది. -
అత్యంత దగ్గరగా వచ్చిన రెండు విమానాలు.. ఎయిర్‌పోర్టులో ఆందోళనకర ఘటన
ఎయిర్‌పోర్టు(Airport)లో ఆగిఉన్న ఒక విమానాన్ని మరో విమానం ఢీకొంది. దాంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఆందోళన వ్యక్తమైంది. -
మహిళా ప్రయాణికురాలిపై కండక్టర్ దాడి.. సస్పెండ్ చేసిన అధికారులు
ఓ కండక్టర్ బస్సులోని మహిళా ప్రయాణికురాలిపై దాడి చేసిన వీడియో వైరలవడంతో అధికారులు ఆ కండక్టర్‌ను సస్పెండ్ చేసిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. -
దిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు దక్కని ఊరట
తన అరెస్టును సవాల్ చేస్తూ దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఉపశమనం లభించలేదు. -
ఒక్క ఓటరు కోసం.. 39 కి.మీ. ట్రెక్కింగ్‌కు పోలింగ్ సిబ్బంది రెడీ!
అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh)లోని ఓ మారుమూల గ్రామంలో ఓ మహిళా ఓటరు కోసం పోలింగ్ సిబ్బంది దాదాపు 39 కి.మీ.ల దూరం ట్రెక్కింగ్ చేసేందుకు సిద్ధమయ్యారు. -
మయన్మార్ సరిహద్దుల్లో కంచె.. రూ.30,000 కోట్ల ఖర్చు..!
India - Myanmar: భారత్-మయన్మార్ సరిహద్దుల్లో 1600 కిలోమీటర్ల కంచె నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.30వేల కోట్లు వెచ్చించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
‘సునీత.. రబ్రీ దేవిలా మారనున్నారా?’.. వీడియో సందేశంపై భాజపా విమర్శలు!
ఈడీ కస్టడీ నుంచి కేజ్రీవాల్ ఇచ్చిన సందేశాన్ని సునీత వినిపించడంపై విమర్శలు గుప్పించిన భాజపా.. బిహార్‌లో రబ్రీ దేవి మాదిరిగా ఆమె కూడా మారనున్నారనే అనుమానం వ్యక్తం చేసింది. -
కరెన్సీ నోట్లపై నిద్రించిన నేత.. నెట్టింట్లో వైరల్‌గా మారిన ఫొటో
ఓ రాజకీయ నేతకు చెందిన ఫొటో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. అందులో ఆయన కరెన్సీ నోట్ల (Currency notes) పై హాయిగా నిద్రిస్తుండటమే కారణం. -
కస్టడీలో క్షీణించిన కేజ్రీవాల్ ఆరోగ్యం.. ఆప్ వర్గాల వెల్లడి
Arvind Kejriwal: ఈడీ కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ షుగర్ లెవల్స్ పడిపోయినట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆప్ వర్గాలు ఆరోపించాయి. -
కేరళ సీఎం కుమార్తెపై మనీలాండరింగ్ కేసు
కేరళ సీఎం పినరయి విజయన్ కుమార్తెపై ఈడీ పీఎంఎల్ఏ చట్టం కింద కేసు నమోదు చేసింది. దీని విచారణకు సంబంధించి త్వరలో సమన్లు జారీ చేయనుంది. -
దిలీప్ ఘోష్‌కు భాజపా షోకాజ్ నోటీసులు.. క్షమాపణలు చెప్పిన ఎంపీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఎంపీ దిలీప్ ఘోష్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యపై వివరణ కోరుతూ భారతీయ జనతా పార్టీ ఆయనకు బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించిన ఘోష్ తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరారు. -
నిరుద్యోగ సమస్యపై ‘సీఈఏ’ వ్యాఖ్యలు.. మండిపడ్డ కాంగ్రెస్
‘అన్ని సమస్యలను ప్రభుత్వం పరిష్కరించలేదు’ అని ముఖ్య ఆర్థిక సలహాదారు (CEA) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. -
కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా వ్యాఖ్యలు.. భారత్ తీవ్ర అభ్యంతరం
Kejriwal arrest: దిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా పరిగణించింది. దిల్లీలోని ఆ దేశ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ రేపు కోర్టులో చెబుతారు: సతీమణి సంచలన ప్రకటన
Sunita Kejriwal: దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై ఆయన సతీమణి సునీత మరో వీడియో సందేశం విడుదల చేశారు. ఈ కేసుకు సంబంధించి నిజాలన్నీ ఆయన గురువారం కోర్టులో బయటపెడతారని చెప్పారు. -
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్.. ఆరుగురు నక్సల్స్ హతం
Encounter: బీజాపుర్ జిల్లాలో బుధవారం ఎన్కౌంటర్ జరిగింది. ఆరుగురు మావోయిస్టులను పోలీసులు మట్టుబెట్టారు. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో మునావర్ ఫరూఖీ
బిగ్‌బాస్ విన్నర్ మునావర్ ఫరూఖీ(Munawar Faruqui)ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
బిహార్‌లో ఒకే ఇంట్లో ఏడుగురు ‘పోలీస్’ సిస్టర్స్..
బిహార్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అక్కాచెల్లెళ్లు పోలీసు - అబ్కారీ శాఖల్లో, కేంద్ర సాయుధ బలగాల్లో పనిచేస్తున్నారు. -
ఓటీపీ మోసాలకు సరికొత్త విరుగుడు
ఆధునిక కాలంలో ఓటీపీ మోసాలు, పాస్వర్డ్ హ్యాకింగ్ ఉదంతాలు ఎక్కువయ్యాయి. వీటి కట్టడికి హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ ఐఐటీ శాస్త్రవేత్తలు ఒక విప్లవాత్మక వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
గాజా వివాదంపై అమెరికా తీరుకు నిరసన.. పీహెచ్డీ డిగ్రీనీ వెనక్కి ఇచ్చేసిన సందీప్‌పాండే
దాదాపు ఆర్నెల్లుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ - పాలస్తీనా యుద్ధంలో అమెరికా అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా గత జనవరిలో రామన్ మెగసెసె అవార్డు వదులుకొంటున్నట్లు ప్రకటించిన సామాజిక ఉద్యమకారుడు సందీప్‌పాండే బర్కిలీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి తాను చేసిన పీహెచ్డీ డిగ్రీని సైతం తాజాగా వెనక్కు ఇచ్చేశారు. -
భాజపా మాయ నుంచి యువత బయటకు రావాలి
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని భాజపా నిలబెట్టుకోలేదు. అబద్ధపు వాగ్దానం ఎందుకు చేశారని యువత ఇప్పుడు ఆ పార్టీని ప్రశ్నిస్తోంది. -
యూట్యూబ్ తొలగించిన వీడియోలు 22.5 లక్షలు
సామాజిక మార్గదర్శకాలు ఉల్లంఘించినందుకు మన దేశానికి చెందిన 22.5 లక్షల వీడియోలను గత ఏడాది అక్టోబరు- డిసెంబరు మధ్య యూట్యూబ్ తొలగించింది.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా అభ్యర్థుల్ని ప్రకటించాల్సిన స్థానాలివే!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పెద్దిరెడ్డికి ఇసుకే అల్పాహారం.. మైన్స్ మధ్యాహ్న భోజనం: చంద్రబాబు
-
జాన్వీతో రామ్ చరణ్ సినిమా.. ఏడేళ్ల క్రితమే కోరిక బయటపెట్టిన చిరంజీవి
-
దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది ‘రాజకీయ ప్రతీకారమే’ - ఆప్
-
మథుర కాకపోతే పోటీ చేసేదాన్ని కాదు : హేమమాలిని