
మేము మా దేశంలోనే ఉన్నాం.. మీకేంటి బాధ?
అమిత్ షా పర్యటనపై చైనా అభ్యంతరం.. భారత్ ఆగ్రహం
దిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనకు చైనా అభ్యంతరం తెలపడంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. భారతదేశంలో అంతర్భాగమైన రాష్ట్రంలో నాయకులు పర్యటిస్తే అభ్యంతరం తెలపడం సహేతుకం కాదంటూ డ్రాగన్‌పై కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ మండిపడ్డారు. అరుణాచల్‌ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగమని, విడదీయరానిదని చైనాకు ఆయన స్పష్టంచేశారు.
అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్కడ పర్యటించడంపై డ్రాగన్ అభ్యంతరం తెలిపింది. అమిత్ షా పర్యటన తమ ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని చైనా విదేశాంగ శాఖ గురువారం వ్యాఖ్యానించింది. అరుణాచల్‌ప్రదేశ్‌లో అమిత్ షా పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపింది. సరిహద్దు సమస్యను మరింత జటిలం చేసే చర్యలను ఆపాలంది. సరిహద్దు ప్రాంతంలో శాంతి, సామరస్యతను నెలకొల్పేందుకు భారత్ చర్యలు తీసుకోవాలని సూచించింది. అరుణాచల్ ప్రదేశ్ తమ ఆధీనంలోని టిబెట్‌లో భాగమంటూ చైనా ఆది నుంచీ వాదిస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.