ఫిజికల్‌ టెస్ట్‌ కోసం మహిళలను నగ్నంగా..

రుతుస్రావంలో ఉన్న అమ్మాయిని గుర్తించేందుకు ఇటీవల గుజరాత్‌లోని ఓ మహిళల కాలేజీలో విద్యార్థినుల దుస్తులు విప్పించిన సంఘటన మరవక ముందే తాజాగా అదే రాష్ట్రంలో మరో అమానవీయ ఘటన చోటుచేసుకుంది.

Published : 21 Feb 2020 17:19 IST

సూరత్‌: రుతుస్రావంలో ఉన్న అమ్మాయిని గుర్తించేందుకు ఇటీవల గుజరాత్‌లోని ఓ మహిళల కాలేజీలో విద్యార్థినుల దుస్తులు విప్పించిన సంఘటన మరవక ముందే తాజాగా అదే రాష్ట్రంలో మరో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఫిజికల్‌ టెస్ట్‌ నిమిత్తం ఆసుపత్రికి వచ్చిన ట్రైనీ మహిళా క్లర్క్‌లను నగ్నంగా నిలబెట్టి పరీక్షలు చేశారు అక్కడి వైద్య సిబ్బంది. అంతటితో ఆగకుండా పెళ్లి కాని అమ్మాయిలకు గర్భ నిర్ధారణ పరీక్షలు చేశారు. సూరత్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనపై  విమర్శలు వెల్లువెత్తడంతో ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. వివరాల్లోకి వెళితే..

సూరత్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ నిబంధనల ప్రకారం.. ట్రైనీ సిబ్బంది తమ మూడేళ్ల శిక్షణ కాలం పూర్తి చేసుకున్న తర్వాత తప్పనిసరిగా ఫిజికల్‌ టెస్ట్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగం చేసేందుకు వారు శారీరకంగా ఫిట్‌గా ఉన్నారా? లేదా అనేది తెలుసుకునేందుకు ఈ నిబంధన తీసుకొచ్చారు. దీంతో శిక్షణ పూర్తి చేసుకున్న 10 మంది మహిళా ట్రైనీ క్లర్క్‌లు గురువారం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న సూరత్‌ మున్సిపల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ ఆసుపత్రికి వెళ్లారు. అయితే అక్కడ వారికి చేదు అనుభవం ఎదురైంది. 

పరీక్షల పేరుతో అక్కడి మహిళా వైద్యులు తమను నగ్నంగా నిలబెట్టారని ట్రైనీ క్లర్క్‌లు ఆరోపించారు. ‘ఒకరి తర్వాత ఒకరిని లోపలికి పిలవకుండా అందర్నీ ఒకేసారి రమ్మన్నారు. వెళ్లాక మమ్మల్ని నిగ్నంగా నిలబెట్టి పరీక్షించారు. అంతేగాక, అక్కడి లేడీ డాక్టర్‌ ప్రెగ్నెన్సీ గురించి ఇబ్బందికర ప్రశ్నలతో వేధించారు. పెళ్లికాని అమ్మాయిలకు కూడా గర్భనిర్ధారణ పరీక్షలు చేశారు’ అని ట్రైనీ క్లర్క్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మున్సిపల్‌ కమిషనర్‌ బంచనిధి పాణీకి ఉద్యోగుల సంఘం ఫిర్యాదు చేసింది. దీంతో ఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు పాణీ.. ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. బాధ్యుతలపై కఠిన చర్యలు తీసుకుంటామని సూరత్‌ మేయర్‌ జగదీశ్‌ పటేల్‌ హామీ ఇచ్చారు. 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని