నౌకలోని భారతీయులకు మరోసారి పరీక్షలు 

జపాన్‌కు చెందిన విహారనౌక ‘డైమండ్‌ ప్రిన్సెస్‌’లో ఉన్న భారతీయులు సహా ఇతర ప్రయాణికులకు జపాన్ అధికారులు మళ్లీ కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు జపాన్‌లోని భారత రాయబార అధికార కార్యాలయం శనివారం ట్విటర్‌ ద్వారా వెల్లడించింది.

Published : 22 Feb 2020 19:43 IST

టోక్యో: జపాన్‌కు చెందిన విహారనౌక ‘డైమండ్‌ ప్రిన్సెస్‌’లో ఉన్న భారతీయులు సహా ఇతర ప్రయాణికులకు జపాన్ అధికారులు మళ్లీ కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు జపాన్‌లోని భారత రాయబార అధికార కార్యాలయం శనివారం ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. ‘ప్రస్తుతం నౌకలో ఉన్న భారతీయులకు జపాన్‌ అధికారులు మరోసారి పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో ఏ ఒక్కరూ కొవిడ్ లక్షణాలతో ఉండకూడదని ఆశిస్తున్నాం. ఇప్పటివరకూ కొవిడ్‌ పాజిటివ్‌గా తేలిన 8మంది భారతీయులను చికిత్స నిమిత్తం జపాన్‌లో ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి క్రమంగా మెరుగవుతోంది. శుక్రవారం నాటికి కొత్తగా కేసులు ఏవీ నమోదు కాలేదు’ అని వెల్లడించింది. 

శుక్రవారం కొవిడ్‌ లక్షణాలు లేవని నిర్ధారణ అయిన కొందరు ప్రయాణికుల్ని నౌక నుంచి విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సిబ్బందితో కలిపి దాదాపు 1000 మంది ప్రయాణికులు నౌకలో మిగిలి ఉన్నట్లు జపాన్‌ కేబినెట్‌ ముఖ్య కార్యదర్శి యోషిహిడే సుగా తెలిపారు. కాగా నౌకలో మొత్తం 138 మంది భారతీయులు ఉన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని