కూలిన మిగ్‌-29కే యుద్ధ విమానం

భారత నౌకాదళానికి చెందిన మిగ్‌-29కె శిక్షణ యుద్ధ విమానం ఆదివారం గోవా తీరంలో కూలిపోయింది. ఈ ప్రమాదం నుంచి పైలట్‌ క్షేమంగా బయటపడ్డారని రక్షణ శాఖ అధికారులు  తెలిపారు.......

Published : 23 Feb 2020 14:07 IST

పణజీ: భారత నౌకాదళానికి చెందిన మిగ్‌-29కె శిక్షణ యుద్ధ విమానం ఆదివారం గోవా తీరంలో కూలిపోయింది. ఈ ప్రమాదం నుంచి పైలట్‌ క్షేమంగా బయటపడ్డారని రక్షణ శాఖ అధికారులు  తెలిపారు. రోజువారీ శిక్షణలో భాగంగా బయలుదేరిన ఈ విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై విచారణకు ఆదేశించామని భారత నౌకాదళం వెల్లడించింది. గత నవంబరులోనూ ఇదే రకానికి చెందిన విమానం కూలిన విషయం తెలిసిందే. అప్పుడు పక్షులు అడ్డురావడంతో ఇంజిన్ మొరాయించి ప్రమాదం సంభవించింది. అయితే పైలట్ల చాకచక్యంతో జనావాసాల్లో పడకుండా జాగ్రత్తపడ్డారు. వారు కూడా వెంటనే బయటకు దూకి ప్రాణాలు రక్షించుకున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని