మోస్ట్‌ వాంటెడ్‌ గ్యాంగ్‌స్టర్ రవి పుజారీ అరెస్ట్‌

పరారీలో ఉన్న కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ రవి పుజారీని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. సెనెగల్‌ దేశం నుంచి సోమవారం వేకువజామున భారత్‌కు తీసుకొచ్చారు. పోలీసుల వివరాల ప్రకారం.......

Published : 24 Feb 2020 09:57 IST

బెంగళూరు: పరారీలో ఉన్న కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ రవి పుజారీని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. సెనెగల్‌ దేశం నుంచి సోమవారం వేకువజామున భారత్‌కు తీసుకొచ్చారు. పోలీసుల వివరాల ప్రకారం.. పుజారీ దక్షిణాఫ్రికా దేశంలోని ఓ మారుమూల గ్రామంలో తలదాచుకున్నాడు. సమాచారం అందుకున్న భారత నిఘా వర్గాలు సెనెగల్‌ భద్రతా దళాలకు సమాచారం అందజేశాయి. వెంటనే దక్షిణాఫ్రికాలో పుజారీ ఉంటున్న ఇంటికి చేరుకున్న వారు సెనెగల్‌ తీసుకొచ్చారు. అక్కడ విచారణ పూర్తయిన తర్వాత భారత పోలీసు అధికారులకు అప్పగించారు. భారత్‌ నుంచి తొలుత సెనెగల్‌ పారిపోయిన అతడు అక్కడా అనేక నేరాలకు పాల్పడ్డాడు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దోపిడీ రాకెట్లలో ప్రధాన నిందితుడు. దీంతో అతణ్ని అరెస్టు చేసి జైల్లో ఉంచగా.. అక్కడి నుంచి తప్పించుకొని దక్షిణాఫ్రికాకు పారిపోయాడు. అతని వద్ద బుర్కినాఫసో దేశానికి చెందిన పాస్‌పోర్టు ఉన్నట్లు గుర్తించారు. భారత్‌లో రవి పుజారీపై దాదాపు 200 కేసులు నమోదయ్యాయి. అతడి స్వస్థలమైన బెంగళూరులోనే 79 కేసులు ఉన్నాయి. కర్ణాటకలో అతడికి పెద్ద నెట్‌వర్క్‌ ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు