
Updated : 24 Feb 2020 19:33 IST
తాజ్ చెంత ట్రంప్ దంపతులు
ఆగ్రా: భారత చారిత్రక కట్టడం, ప్రపంచ అద్భుతాల్లో ఒకటైన తాజ్‌మహల్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సందర్శించారు. తన సతీమణి మెలానియాతో కలిసి తాజ్ అందాలను వీక్షించారు. అక్కడి ప్రఖ్యాత బెంచ్ వద్ద నిల్చుని ఫొటోలకు పోజిచ్చారు.
అహ్మదాబాద్ నుంచి నేరుగా ఆగ్రా చేరుకున్న ట్రంప్ దంపతులకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆ రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్ సాదర స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా ట్రంప్ దంపతులు తాజ్‌మహల్ చేరుకున్నారు. స్థానిక గైడ్ ఒకరు వీరికి తాజ్ గొప్పదనాన్ని వివరించారు. అంతకుముందు ఇక్కడి సందర్శకుల పుస్తకంలో ట్రంప్ తన సందేశాన్ని రాశారు. కాసేపటి తర్వాత ట్రంప్ కుమార్తె ఇవాంకా, అల్లుడు జేర్డ్ కుష్నర్ కూడా తాజ్ సందర్శనకు వచ్చారు.
Advertisement
Tags :