తాజ్‌ను చూడగానే ట్రంప్‌ అన్న తొలిమాట..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆయన సతీమణి మెలనియా ప్రేమకు చిహ్నమైన తాజ్‌మహల్‌ను చూసి మంత్రముగ్ధులయ్యారు. పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ చారిత్రక కట్టడ..........

Updated : 25 Feb 2020 21:08 IST

ఆగ్రా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆయన సతీమణి మెలనియా ..ప్రేమకు చిహ్నమైన తాజ్‌మహల్‌ను చూసి మంత్రముగ్ధులయ్యారు. పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ చారిత్రక కట్టడం అందాల్ని ఆస్వాదించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గైడ్‌ నితిన్‌ కుమార్‌ సింగ్‌ వారికి తాజ్‌ విశిష్టతను, చరిత్రను వివరించారు. అయితే తాజ్‌ను చూసిన వెంటనే ఆశ్చర్యానికిలోనైన ట్రంప్‌ దంపతులు ‘అద్భుతం’ అంటూ కట్టడాన్ని కొనియాడారని గైడ్‌ నితిన్‌ తెలిపారు. తాజ్‌ అందాల్ని వీక్షించేందుకు మరోసారి కూడా వస్తామని మాటిచ్చారని ఆయన వెల్లడించారు. వీరి రాక నేపథ్యంలో తాజ్‌లోని షాజహాన్‌, ముంతాజ్‌ సమాధులను ‘మడ్ ప్యాక్‌’ ట్రీట్‌మెంట్‌తో శుభ్రపరిచిన విషయం తెలిసిందే. ఈ విధానం గురించి ప్రత్యేకంగా అడిగి మరీ తెలుసుకున్న మెలనియా ఆశ్చర్యానికి గురయ్యారని నితిన్‌ తెలిపారు. షాజహాన్‌, ముంతాజ్‌ మహల్‌ ప్రేమకథను విన్న ట్రంప్‌ ఉద్వేగానికి లోనయ్యారన్నారు. 

అహ్మదాబాద్‌లో ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రత్యేక విమానంలో నేరుగా ట్రంప్ దంపతులు ఆగ్రాకు చేరుకున్న విషయం తెలిసిందే. చల్లటి ఆహ్లాదకర వాతావరణంలో తాజ్‌ అందాల్ని, నిర్మాణ కౌశలాన్ని, అక్కడి పరిసరాల్ని చూసి పులకించిపోయారు. దాదాపు గంటసేపు అక్కడే ఉన్న వారు.. సూర్యాస్తమయంలో తాజ్‌ అందాల్ని వీక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని