
మహాత్ముడికి ట్రంప్ నివాళులు
దిల్లీ: భారత పర్యటనలో ఉన్న అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ జాతిపిత మహాత్మాగాంధీ స్మారక స్థలం రాజ్‌ఘాట్‌ను సందర్శించారు. బాపూజీ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అక్కడి సందర్శకుల పుస్తకంలో తన సందేశాన్ని రాశారు. ‘మహాత్ముడి ఆలోచనల నుంచి ఉద్భవించిన అద్భుతమైన భారత్‌కు అమెరికా ప్రజలు ఎప్పుడూ అండగా ఉంటారు. ఇది నాకు దక్కిన అద్భుతమైన గౌరవం’ అని రాసుకొచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి.. ట్రంప్ దంపతులకు మహాత్ముడి ప్రతిమను బహుమతిగా ఇచ్చారు. అనంతరం రాజ్‌ఘాట్ ప్రాంగణంలో ట్రంప్ ఓ మొక్కను నాటారు.
రాజ్‌ఘాట్ నుంచి నేరుగా హైదరాబాద్ హౌస్‌కు బయల్దేరారు. ఇప్పటికే ప్రధాని మోదీ హౌదరాబాద్ హౌస్‌కు చేరుకున్నారు. కాసేపట్లో ఇరువురి మధ్య ద్వైపాక్షిక భేటీ జరగనుంది. అంతకుముందు రాష్ట్రపతి భవన్లో ట్రంప్ త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ ఉదయం రాష్ట్రపతిభవన్‌కు విచ్చేసిన ట్రంప్ దంపతులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు సాదర స్వాగతం పలికారు. ఆ తర్వాత త్రివిధ దళాలు గౌరవ వందనం సమర్పించాయి. అనంతరం ప్రధాని మోదీ.. కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులను ట్రంప్‌నకు పరిచయం చేశారు.
మరిన్ని చిత్రాల కోసం క్లిక్ చేయండి