వేర్వేరుగా ఉరిపై విచారణ వాయిదా

సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులను వేర్వేరుగా ఉరితీసేలా ఆదేశాలివ్వాలంటూ కేంద్రం వేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈ పిటిషన్‌ను మార్చి 5న విచారిస్తామని

Updated : 25 Feb 2020 12:20 IST

దిల్లీ: సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులను వేర్వేరుగా ఉరితీసేలా ఆదేశాలివ్వాలంటూ కేంద్రం వేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈ పిటిషన్‌ను మార్చి 5న విచారిస్తామని జస్టిస్‌ ఆర్‌ భానుమతి నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. 

నిర్భయ దోషుల ఉరితీత పలుమార్లు వాయిదా పడుతున్న నేపథ్యంలో దోషులను వేర్వేరుగా ఉరితీయాలంటూ కేంద్ర హోంశాఖ దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే నిబంధనల ప్రకారం ఒకే కేసుకు సంబంధించిన దోషులను వేర్వేరుగా ఉరితీయడం కుదరదని చెబుతూ కేంద్రం పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌ నేడు విచారణకు రాగా.. ఈ కేసులో దోషుల ఉరికి కొత్త డెత్‌ వారెంట్లు జారీ అయినట్లు అదనపు సొలిసిటర్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్రం పిటిషన్‌పై విచారణను ధర్మాసనం మార్చి 5కు వాయిదా వేసింది. నిర్భయ దోషులను మార్చి 3న ఉరితీసేందుకు ఇటీవల పటియాలా హౌస్‌ కోర్టు కొత్త డెత్‌ వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని