దిల్లీ హింస.. 10 మంది మృతి 

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక, అనుకూల వర్గాల ఆందోళనలతో ఈశాన్య దిల్లీ అట్టుడుకుతోంది. పలుచోట్ల చెలరేగిన హింసాత్మక ఘటనలు మరింత తీవ్రరూపం.......

Published : 25 Feb 2020 19:36 IST

దిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక, అనుకూల వర్గాల ఆందోళనలతో ఈశాన్య దిల్లీ అట్టుడుకుతోంది. పలుచోట్ల చెలరేగిన హింసాత్మక ఘటనలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఈ హింసలో ఇప్పటివరకు ఓ హెడ్‌ కానిస్టేబుల్‌తో పాటు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 186 మందికి పైగా గాయపడటంతో వారిని జీటీబీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  క్షతగాత్రుల్లో  130 మంది పౌరులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలపై దిల్లీ పోలీసులు మొత్తం 11 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఈశాన్య దిల్లీలోని మౌజ్‌పూర్‌, జఫ్రాబాద్‌, చాంద్‌బాగ్‌, కర్వాల్‌ నగర్‌ తదితర ప్రాంతాల్లో బలగాలను మోహరించినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కర్ఫ్యూ విధించారు.  యూపీలోని ఘజియాబాద్‌లోనూ 144 సెక్షన్‌ విధించారు. మద్యం దుకాణాలన్నింటినీ మూసివేయాలని ఆదేశాలు జారీచేశారు.  

ఘటనపై దీదీ విచారం
దిల్లీ హింసపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ విచారం వ్యక్తంచేశారు. ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయో తెలియడంలేదంటూ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రతి ఒక్కరూ శాంతి పునరుద్ధరణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. భారత ప్రజలు శాంతిని కోరుకుంటున్నారనీ.. ప్రతిఒక్కరూ సంయమనంతో ఉండాలని కోరారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని