వరదల్లో ఇండోనేషియా రాజధాని

ఇండోనేషియా రాజధాని జకార్తాను వరదలు ముంచెత్తుతున్నాయి. అక్కడ ఆదివారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాటి ఉప నదులు పొంగిపొర్లడంతో పాటు కొన్ని కట్టలు తెగిపోయాయి. అధ్యక్ష భవనంతో పాటు వేల నివాసాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. రవాణా వ్యవస్థ స్తంభించిపోయిందని

Published : 25 Feb 2020 23:56 IST

నివాస, వాణిజ్య సముదాయాలను ముంచెత్తిన బురద

జకార్తా: ఇండోనేషియా రాజధాని జకార్తాను వరదలు ముంచెత్తుతున్నాయి. అక్కడ ఆదివారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాటి ఉప నదులు పొంగిపొర్లడంతో పాటు కొన్ని కట్టలు తెగిపోయాయి. అధ్యక్ష భవనంతో పాటు వేల నివాసాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. రవాణా వ్యవస్థ స్తంభించిపోయిందని విపత్తు నిర్వహణ అధికారులు వెల్లడించారు. భవనాలు, వాణిజ్య సముదాయాల్లో అయిదు అడుగుల మేర బురద నిండిపోయినట్లు అధికారులు తెలిపారు. అధ్యక్ష భవనంలోకి చేరిన నీటిని పంపుల సాయంతో తోడేస్తున్నట్లు పేర్కొన్నారు. అనేక జిల్లాలు వరద బారిన పడ్డాయని. ఇళ్లపై సహాయం కోసం ఎదురుచూస్తున్న పిల్లలు, వృద్ధులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యంత్రాంగం చర్యలు తీసుకుంది. మరో రెండు వారాల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని