దిల్లీ ఘర్షణల్లో నా ప్రమేయం లేదు: ఆప్‌ నేత..!

దిల్లీ: ఈశాన్య దిల్లీలో నెలకొన్న ఘర్షణ వాతావరణంలో తన ప్రమేయం ఉందంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆమ్‌ఆద్మీ నేత తాహిర్‌ హుస్సేన్‌ తాజాగా ఓ వీడియోని విడుదల చేశాడు.

Updated : 27 Feb 2020 20:39 IST

ఆరోపణలు రుజువైతే చర్యలు తప్పవన్న పార్టీ అధిష్టానం

దిల్లీ: ఈశాన్య దిల్లీలో నెలకొన్న ఘర్షణల్లో తన ప్రమేయం ఉందంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆమ్‌ఆద్మీ నేత తాహిర్‌ హుస్సేన్‌ తాజాగా ఓ వీడియోని విడుదల చేశాడు. ఈ ఆరోపణల్లో వాస్తవంలేదని, ఇవి కేవలం రాజకీయంగా ప్రేరేపితమైనవనే వివరణ ఇచ్చాడు. కేవలం వేరేపార్టీకి చెందిన నేతలు ప్రేరేపించడంవలనే ఈశాన్య దిల్లీలో ఈ ఘర్షణ వాతావరణం ఏర్పడిందని ఆరోపించాడు. ఆందోళన కారులు తన ఇంటిపైకి వస్తున్నారనే విషయాన్ని ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చానని పేర్కొన్నాడు. ఇందులో నాప్రమేయం లేనేలేదు..నన్ను నమ్మండి అంటూ అభ్యర్థించాడు. ఇదే విషయాన్ని ఆమ్‌ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్‌ సింగ్‌ సమర్ధించారు. అయితే, తప్పు చేశారని రుజువైతే వారు ఏస్థానంలో ఉన్నా, ఏ మతానికి చెందినవారైనా తమ పార్టీ చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

ఈశాన్య దిల్లీలో ఇంటెలిజన్స్‌ అధికారి అంకిత్‌ శర్మ మృతదేహం ఓ నాలాలో లభించిన విషయం తెలిసిందే. అయితే ఈ మరణానికి ఆప్‌ స్థానిక నేత హుస్సేన్‌ అనుచరులే కారణమంటూ అంకిత్‌ శర్మ తండ్రి ఆరోపించాడు. 


 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని