అంతొద్దు, ఇది చాలు అంటున్న ప్రిన్స్‌ హ్యారీ

తనను కేవలం ‘హ్యారీ’ అని మాత్రమే సంబోధించాల్సిందిగా బ్రిటన్‌ యువరాజు ప్రిన్స్‌ హ్యారీ కోరారు.

Published : 28 Feb 2020 00:21 IST

నన్ను ‘హ్యారీ’ అని మాత్రమే పిలవండి అంటున్న బ్రిటన్‌ యువరాజు

లండన్‌: తనను కేవలం ‘హ్యారీ’ అని మాత్రమే సంబోధించాల్సిందిగా బ్రిటన్‌ యువరాజు ప్రిన్స్‌ హ్యారీ కోరారు. తన పర్యాటక ప్రాజెక్టు ‘ట్రావలిస్ట్‌’ కు సంబంధించి ఎడింబరోలో జరిగిన ఓ సమావేశంలో ఆయన బుధవారం పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఆయన రైలులో రావటం గమనార్హం. బ్రిటన్‌ మహారాణి క్వీన్‌ ఎలిజబెత్‌ 2 రెండవ మనవడైన ప్రిన్స్‌ హ్యారీ, ఆయన భార్య మేఘాన్‌ మెర్కెల్‌ మార్చి నెలాఖరు నుంచి తన ‘హిజ్‌ రాయల్‌ హైనెస్‌’ అనే గౌరవార్థకాన్ని కోల్పోనున్నారు. అయితే మార్చి లోగానే హ్యారీ సాధారణ జీవితాన్ని ఆహ్వానిస్తున్నట్టు ఈ ప్రకటనతో స్పష్టమయ్యింది. 

‘‘తనను హ్యారీ అని మాత్రమే పిలవాల్సిందిగా ఆయన స్పష్టం చేసినందువల్ల హ్యారీకి ఘన స్వాగతాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను’’ అని ఆ కార్యక్రమ నిర్వాహకురాలు అయేషా హజారికా ప్రకటించారు. బ్రిటన్‌ సింహాసనపు వారసత్వ వరుసలో హ్యారీ ఆరవ వారు. తను, తన భార్య రాచరికపు హోదానుంచి తప్పుకోవాలనుకుంటున్నామంటూ జనవరిలో ప్రిన్స్‌ హ్యారీ చేసిన ప్రకటన ఇంగ్లండు రాజరిక వ్యవస్థలో ప్రకంపనలు సృష్టించింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని