దిల్లీ ఘటనలు: సీబీఎస్‌ఈ పరీక్షలు వాయిదా

హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న ఈశాన్య దిల్లీ, తూర్పు దిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఫిబ్రవరి 28, 29న జరిగే 10, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసినట్లు సీబీఎస్‌ఈ గురువారం ప్రకటించింది. విద్యార్థులు, ఉపాధ్యాయులకు

Updated : 27 Feb 2020 17:24 IST

దిల్లీ: హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న ఈశాన్య దిల్లీ, తూర్పు దిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఫిబ్రవరి 28, 29న జరిగే 10, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసినట్లు సీబీఎస్‌ఈ గురువారం ప్రకటించింది. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు సెక్రటరీ అనురాగ్‌ త్రిపాఠి తెలిపారు. ఈ పరీక్షల పునఃనిర్వహణకు త్వరలోనే షెడ్యూల్‌ విడుదల చేస్తామని వెల్లడించారు. అయితే దిల్లీలోని ఇతర కేంద్రాల్లో జరిగే పరీక్షలను మాత్రం వాయిదా వేయడం లేదని, అవి షెడ్యూల్‌ ప్రకారం జరుగుతాయని చెప్పారు. అంతేగాక, మార్చి 2 నుంచి జరిగే పరీక్షలు దిల్లీ వ్యాప్తంగా అన్ని పరీక్షాకేంద్రాల్లో యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. 

అంతేగాక, ఈశాన్య దిల్లీ ఘర్షణల కారణంగా దేశ రాజధానిలోని ఇతర ప్రాంతాల్లో పరీక్షలకు హాజరుకాలేకపోయిన విద్యార్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని బోర్డు ప్రకటించింది. ఇందుకోసం స్కూల్‌ యాజమాన్యాల నుంచి సమాచారం కోరింది. ‘అల్లర్ల పరిస్థితుల కారణంగా పరీక్షలకు హాజరుకాలేకపోయిన 10, 12వ తరగతి విద్యార్థుల వివరాలు ఇవ్వాలని స్కూల్‌ ప్రిన్సిపల్స్‌ను అడిగాం. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు వారికి మళ్లీ పరీక్షలు నిర్వహిస్తాం. త్వరలోనే కొత్త తేదీలు ప్రకటిస్తాం’ అని  వెల్లడించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని