నేతల వ్యాఖ్యలు.. కేంద్రానికి 4 వారాల గడువు

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన భాజపా నాయకులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై కేంద్రం ఇంప్లీడ్‌మెంట్‌ దాఖలు చేసేందుకు దిల్లీ హైకోర్టు అనుమతి....

Published : 27 Feb 2020 23:40 IST

దిల్లీ: రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన భాజపా నాయకులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై కేంద్రం ఇంప్లీడ్‌మెంట్‌ దాఖలు చేసేందుకు దిల్లీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. దీనిపై గురువారం విచారణ చేపట్టిన జస్టిస్‌ డీఎన్‌ పటేల్‌, జస్టిస్‌ సి హరి శంకర్‌తో కూడిన ధర్మాసనం కేంద్రానికి, దిల్లీ పోలీసులకు నాలుగు వారాల గడువిచ్చింది. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. దిల్లీలో శాంతిభద్రతల పరిరక్షణ కేంద్రానిదే బాధ్యత అన్నారు. ఇప్పటి వరకు హింసకు సంబంధించి 48 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే దిల్లీలో పరిస్థితి అదుపులోకి వచ్చేంత వరకు న్యాయజోక్యం కూడదని పేర్కొన్నారు.

సీఏఏ ఆందోళనల్లో భాగంగా ఈశాన్య దిల్లీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో గురువారం నాటికి 34 మంది మరణించారు. సుమారు 200 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు ముందు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన భాజపా నేతలు అనురాగ్‌ ఠాకూర్‌, పర్వేష్‌ వర్మ, కమిల్‌ మిశ్రాలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంలో విఫలమయ్యారంటూ బుధవారం నాటి విచారణలో దిల్లీ హైకోర్టు పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తంచేసింది. ఈ నేపథ్యంలో అసంతృప్తి వ్యక్తం చేసిన దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌. మురళీధర్‌పై బదిలీ వేటు పడడం గమనార్హం.

ఇదీ చదవండి...

హైకోర్టు న్యాయమూర్తి బదిలీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని