దిల్లీ ఘర్షణల దర్యాప్తుకు సిట్‌ బృందాల ఏర్పాటు

దేశరాజధానిలో ఇటీవల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలను విచారించేందుకు రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలను(సిట్‌) ఏర్పాటు చేశారు. ఘర్షణలకు సంబంధించిన దిల్లీ నేర విభాగ పరిధిలోని కేసులన్నింటినీ ఆ సిట్‌ బృందాలకు బదిలీ చేయనున్నారు.

Updated : 27 Feb 2020 20:13 IST

దిల్లీ: దేశరాజధానిలో ఇటీవల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలను విచారించేందుకు రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలను(సిట్‌) ఏర్పాటు చేశారు. ఘర్షణలకు సంబంధించిన దిల్లీ నేర విభాగ పరిధిలోని కేసులన్నింటినీ ఆ సిట్‌ బృందాలకు బదిలీ చేయనున్నారు. ఒక బృందానికి డీసీపీ రాజేశ్‌ దేవ్‌, మరో బృందానికి నేర విభాగం అదనపు సీపీ బీకే సింగ్‌ నేతృత్వం వహించనున్నారు. ఆ కేసులన్నింటినీ ఈ ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో దర్యాప్తు చేయనున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ అల్లర్లకు సంబంధించి ఇప్పటివరకూ 48 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా.. 130 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.  ఈశాన్య దిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) కారణంగా ఆదివారం ఘర్షణలు మొదలైన విషయం తెలిసిందే. ఆందోళనకారులు రాళ్లు విసరడం, ఇళ్లను తగలబెట్టడానికి పాల్పడటంతో ఈ ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. ఈక్రమంలో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 200 మంది వరకు గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని