‘ఈశాన్య దిల్లీలో సాధారణ పరిస్థితులు’

ఈశాన్య దిల్లీలో దాదాపు అన్ని ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని జాయింట్‌ కమిషనర్‌ ఓ.పి.మిశ్రా తెలిపారు. ఈరోజు ఆయన ఘర్షణల ప్రభావం అధికంగా ఉన్న చాంద్‌బాద్‌ ప్రాంతంలో సందర్శించారు.......

Published : 28 Feb 2020 14:04 IST

ప్రభావిత ప్రాంతంలో పర్యటించిన జాయింట్‌ కమిషనర్‌

దిల్లీ: ఈశాన్య దిల్లీలో దాదాపు అన్ని ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని జాయింట్‌ కమిషనర్‌ ఓ.పి.మిశ్రా తెలిపారు. ఈరోజు ఆయన ఘర్షణల ప్రభావం అధికంగా ఉన్న చాంద్‌బాద్‌ ప్రాంతంలో సందర్శించారు. చాలా ప్రాంతాల్లో దుకాణాలు, ఇతర కార్యాలయాలు తెరుచుకుంటున్నాయని వెల్లడించారు. గురువారం నుంచే పరిస్థితులు అదుపులోకి వచ్చాయన్నారు. గత రెండు రోజులుగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. స్థానిక ప్రజాసంఘాలతో చర్చలు జరిపామని.. వారికున్న భయాలన్నింటినీ తొలగించామన్నారు. శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. గత రెండు రోజులుగా ఈశాన్య దిల్లీలో జరుగుతున్న ఘర్షణల్లో 38 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. మరో 200 మంది గాయపడ్డట్లు సమాచారం. మరోవైపు దిల్లీ పోలీసు కమిషనర్‌గా ఎస్‌.ఎన్‌.శ్రీవాస్తవకు అదనపు బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యం సంతరించుకుంది.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని