కేంద్రానికి దిల్లీ హైకోర్టు నోటీసులు

దిల్లీ హైకోర్టు కేంద్రంతో పాటు, దిల్లీ ప్రభుత్వం, అక్కడి పోలీసులకు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్‌ నాయకులు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్‌ గాంధీలు విద్వేషపూరిత ప్రసంగాలు చేసినందుకు వారిపై....

Published : 28 Feb 2020 22:48 IST

దిల్లీ: కేంద్రంతో పాటు, దిల్లీ ప్రభుత్వం, దిల్లీ పోలీసులకు దిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్‌ నాయకులు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్‌ గాంధీ విద్వేషపూరిత ప్రసంగాలు చేసినందుకు వారిపై కేసు నమోదు చేయాలని దాఖలైన పిటిషన్లపై శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా వివరణ కోరుతూ జస్టిస్‌ డీఎన్‌ పటేల్, జస్టిస్‌ సి.హరి శంకర్‌తో కూడిన ధర్మాసనం కేంద్ర హోం మంత్రిత్వశాఖకు, దిల్లీ ప్రభుత్వానికి, పోలీసులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 30కి వాయిదా వేసింది. దాంతో పాటు దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్‌, ఏఐఎమ్‌ఐఎమ్‌ నేతలు అక్బరుద్దీన్‌ ఒవైసీ, వారిస్‌ పఠాన్‌లపై కేసు నమోదు చేయాలని దాఖలైన పిటిషన్లపై కూడా స్పందించాలని కోరింది. విద్వేషపూరిత ప్రసంగాలు చేసే వారిని గుర్తించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాలను నియమించాలని, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక నిరసనల వెనక ఉన్నవారిని గుర్తించాలని దాఖలైన పిటిషన్లపై కూడా స్పందిచాలని నోటీసులో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని