రాజధర్మం బోధించొద్దు: భాజపా విసుర్లు

దిల్లీ ఘటనలకు కేంద్రప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. కేంద్ర ప్రభుత్వానికి బాధ్యతలు గుర్తుచేయాల్సిన...

Updated : 28 Feb 2020 23:51 IST

దిల్లీ: దిల్లీ ఘటనలకు కేంద్రప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలపై భాజపా ఘాటుగా స్పందించింది. కేంద్ర ప్రభుత్వానికి బాధ్యతలు గుర్తు చేయాల్సిన అవసరం లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ కాంగ్రెస్‌కు సూచించారు. రాజధర్మం గురించి మీరు మాకు బోధించే అవసరం లేదంటూ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీపై విరుచుకుపడ్డారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దురాక్రమణలు, ఉల్లంఘనలకు పాల్పడ్డ చరిత్ర కాంగ్రెస్‌దని దుయ్యబట్టారు.

శాంతి, సామరస్యానికి రాజకీయాలకతీతంగా కలిసికట్టుగా కృషిచేయాల్సిన సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఈ విషయాన్ని రాజకీయం చేయడాన్ని భాజపా తీవ్రంగా ఖండిస్తోందన్నారు. భారత రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ను కలిసిన సోనియా గాంధీ.. దిల్లీ ఘటనలపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన కేంద్ర మంత్రి అమిత్‌షా, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను వారి బాధ్యతల నుంచి తప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతిని కోరిన విషయం తెలిసిందే.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని