కేంద్ర మంత్రిగారింట్లోనే ‘మంచి’నీరు లేదట!

గ్రామాల్లో, మురికివాడల్లో తరచూ నీటికాలుష్య సమస్య గురించి విని ఉంటాం. కానీ, ఏకంగా కేంద్ర మంత్రి ఇంట్లోనే మంచినీరు ప్రమాణాలకు అనుగుణంగా లేదట. ఈ విషయం స్వయంగా బ్యూరో ఆఫ్‌ ఇండియన్ స్టాండర్డ్‌ (బీఐఎస్‌) సుప్రీంకోర్టుకు నివేదించింది.........

Published : 29 Feb 2020 11:41 IST

దిల్లీ: గ్రామాల్లో, మురికివాడల్లో తరచూ నీటికాలుష్య సమస్య గురించి విని ఉంటాం. కానీ, ఏకంగా కేంద్ర మంత్రి ఇంట్లోనే మంచినీరు ప్రమాణాలకు అనుగుణంగా లేదట. ఈ విషయం స్వయంగా బ్యూరో ఆఫ్‌ ఇండియన్ స్టాండర్డ్‌ (బీఐఎస్‌) సుప్రీంకోర్టుకు నివేదించింది. మొత్తం దిల్లీ వ్యాప్తంగా 11 నమూనాలను సేకరించిన బీఐఎస్‌.. కేంద్రమంత్రి రాంవిలాస్‌ పాసవాన్‌ అధికారిక నివాసంలోనూ నీటిని పరీక్షించింది. సంస్థ నిర్దేశించిన మొత్తం 47 ప్రమాణాల ఆధారంగా నీటిని పరీక్షించగా అల్యూమినియం, కోలిఫాం స్థాయిలు ప్రమాణాల ప్రకారం లేవని గుర్తించినట్లు కోర్టుకు సమర్పించిన నివేదికలో బీఐఎస్‌ పేర్కొంది. చాలా నమూనాల్లో మానవ విసర్జితాల నుంచి వెలువడే కోలిఫాం స్థాయిలు అసాధారణ రీతిలో ఉన్నట్లు గుర్తించామని బీఐఎస్‌ తరఫు న్యాయవాది విపిన్‌ నాయర్‌ కోర్టుకు వివరించారు. 

దిల్లీ సహా ఇతర రాష్ట్రాల రాజధాని నగరాల్లో నీటి నాణ్యతను సంయుక్తంగా పరీక్షించాలని గతంలో సుప్రీంకోర్టు కేంద్ర కాలుష్య నివారణ బోర్డు(సీపీసీబీ), బీఐఎస్‌, ‘దిల్లీ జల్‌ బోర్డు’ను ఆదేశించింది. ఈ మేరకు రంగంలోకి దిగిన సదరు సంస్థలు దిల్లీ సహా మరో 20 నగరాల నుంచి నీటి నమూనాలను సేకరించారు. నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా వాటిని పరీక్షించారు. ఆ నివేదికను తాజాగా కోర్టుకు సమర్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని