షెల్టర్‌ కల్పిస్తే చర్యలే: జేఎన్‌యూ 

దిల్లీ: ఈశాన్య దిల్లీలో జరిగిన ఘర్షణల్లో బాధితులైన వారికి జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో ఆవాసం కల్పిస్తే చర్యలు తీసుకుంటామని వర్సిటీ అధికారులు హెచ్చరించారు. జేఎన్‌యూ క్యాంపస్‌ను షెల్టర్‌గా మార్చడానికి విద్యార్థి సంఘాలకు ఎలాంటి హక్కు లేదని రిజిస్ట్రార్‌ ప్రమోద్‌కుమార్‌ ప్రకటించారు.

Updated : 29 Feb 2020 13:34 IST

దిల్లీ: ఈశాన్య దిల్లీలో జరిగిన ఘర్షణల్లో బాధితులకు జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో ఆవాసం కల్పిస్తే చర్యలు తీసుకుంటామని వర్సిటీ అధికారులు హెచ్చరించారు. జేఎన్‌యూ క్యాంపస్‌ను షెల్టర్‌గా మార్చడానికి విద్యార్థి సంఘాలకు ఎలాంటి హక్కు లేదని రిజిస్ట్రార్‌ ప్రమోద్‌కుమార్‌ ప్రకటించారు. యూనివర్సిటీని కేవలం ఉన్నత చదువులు, పరిశోధనలు కొనసాగించే కేంద్రంగా మాత్రమే చూడాలని విద్యార్ధులకు సూచించారు. యూనివర్సిటీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని విద్యార్థి సంఘాలను హెచ్చరించారు.  దిల్లీలో ఘర్షణ వాతావరణం నేపథ్యంలో ఆవాసం అవసరమైన వారందరికీ జేఎన్‌యూ షెల్టర్‌ కల్పిస్తుందని విద్యార్థి నాయకులు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసిన సందర్భంగా యూనివర్సిటీ ఈ విధంగా హెచ్చరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని