Published : 29/02/2020 17:43 IST

ప్రజలు ఇళ్లలోనే ఉండండి: దక్షిణ కొరియా

సియోల్‌: దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో దక్షిణకొరియా మరిన్ని చర్యలు చేపట్టింది. చైనా వెలుపల అత్యధిక కేసులు నమోదవుతున్న దక్షిణ కొరియాలో ఇప్పటికే 17మంది మరణించగా 3వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్కరోజే 8వందల కేసుల నమోదుకావడంతో ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావద్దని హెచ్చరికలు జారీచేసింది. మతపరమైన సమావేశాలు, నిరసనలు వంటి ఇతర కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొనకూడదని.. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావద్దని సూచించింది. కరోనాకు కళ్లెం వేయడంలో ఇదే కీలక మార్గమని, అందుకే ప్రజలు బయటకు రాకుండా ఇంటికే పరిమితం అవ్వాలని ఆరోగ్యశాఖ ఉపమంత్రి కిమ్‌ కాంగ్‌-లిప్‌ సూచించారు. చైనా వెలుపల అత్యధిక కేసులు నమోదవుతున్న ప్రాంతం దక్షిణకొరియానే. 

అయితే, టెక్నాలిజ్జీఞలో ముందుండే దక్షిణకొరియన్‌లు కరోనా స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రత్యేక మొబైల్‌ యాప్‌లను రూపొందించారు. అలా రూపొందించిన ఓ యాప్‌ ఇప్పుడు దేశంలో అత్యధికంగా డౌన్‌లోడ్‌ అవుతున్న టాప్‌15 యాప్ లలో 6స్థానంలో నిలిచింది. దాదాపు గంటకు 20వేల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నట్లు యాప్‌ డెవలపర్లు వెల్లడించారని అక్కడి మీడియా పేర్కొంది. ఈ యాప్‌ ద్వారా కరోనా ఉన్న వ్యక్తికి సంబంధించిన వివరాలు, వారు సందర్శించిన ప్రదేశంతో పాటు ఏ దేశానికి చెందిన వారనేది కూడా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా కరోనా సోకిన వ్యక్తికి వారు ఎంత దూరంలో ఉన్నారనే సమాచారం కూడా తెలుస్తుండడంతో ప్రజలు దీనిని విస్తృతంగా ఉపయోగిస్తున్నట్లు సమాచారం.  

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని