తాజాగా ఎలాంటి అల్లర్లు లేవు: కేజ్రీవాల్
దేశరాజధానిలో వీలైనంత తొందరగా సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం వెల్లడించారు. తాజాగా దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడారు.
దిల్లీ: దేశరాజధానిలో వీలైనంత తొందరగా సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం వెల్లడించారు. తాజాగా దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడారు. కొత్తగా ఈ రోజు ఎలాంటి హింసాత్మక ఘటనలు నమోదు కాలేదని అన్నారు. తాజా పరిస్థితులపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం సైతం నిర్వహించామని చెప్పారు. అల్లర్ల కారణంగా నాలుగు సబ్డివిజన్ల పరిధిలోని ప్రాంతాలు ప్రభావితమయ్యాయన్నారు. ఆయా ప్రాంతాలను 18 ఎస్డీఎంలు పర్యవేక్షించి నష్టాన్ని గుర్తిస్తున్నారన్నారు. ఎస్డీఎంలు ఇంటింటికీ తిరిగి బాధితుల్ని గుర్తిస్తారని చెప్పారు. ఒక్కొక్కరినీ పిలిచి వారికి భద్రత హామీ ఇస్తారని అన్నారు. ధ్వంసమైన వీధి దీపాల సమాచారాన్ని సేకరించినట్లు చెప్పారు. నష్టపరిహారానికి సంబంధించి దిల్లీ ప్రభుత్వానికి ఇప్పటి వరకు 69 దరఖాస్తులు అందాయని అన్నారు. అల్లర్లలో ఇల్లు ధ్వంసమైన వారికి ఆప్ ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
World News
Earthquake: తుర్కియే, సిరియాలో భూకంపం.. 4,500కి చేరిన మృతులు!
-
Sports News
Ravi Shastri: అశ్విన్.. అతి ప్రణాళికలు వద్దు
-
India News
చనిపోయాడనుకొని ఖననం చేశారు.. కానీ స్నేహితుడికి వీడియో కాల్!
-
Ap-top-news News
Andhra News: పన్నులు వసూలు చేసే వరకూ సెలవుల్లేవ్
-
India News
JEE Main: జేఈఈ మెయిన్ తొలి విడత ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి