దేశంలో శాంతికి నా వంతు పాత్ర పోషిస్తా: రజినీ
దేశంలో శాంతి, సామరస్యాన్ని నెలకొల్పేందుకు తన వంతు పాత్ర పోషించడానికి తానెప్పుడూ సిద్ధంగా ఉంటానని సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నారు. దిల్లీలో ఇటీవల జరిగిన ఘర్షణలను ఖండించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.........
చెన్నై: దేశంలో శాంతి, సామరస్యాన్ని నెలకొల్పేందుకు తన వంతు పాత్ర పోషించడానికి తానెప్పుడూ సిద్ధంగా ఉంటానని సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నారు. దిల్లీలో ఇటీవల జరిగిన ఘర్షణలను ఖండించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అంతకుముందు రజనీకాంత్‌తో పలువురు ముస్లిం మత పెద్దలు ఆదివారం భేటీ అయ్యారు. అనంతరం ట్విటర్ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘దేశంలో శాంతిని పెంపొందించేదుకు నా వంతు పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నాను. దేశంలో ప్రేమ, సమైక్యత, శాంతిని నెలకొల్పడమే ప్రజల తొలి ప్రాధాన్యంగా ఉండాలన్న ముస్లిం సోదరుల అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు.
ఈశాన్య దిల్లీ ఘటనలపై గతవారం రజినీకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఘర్షణల్ని అదుపు చేయడంలో కేంద్రం తీరును ఆయన తప్పుబట్టారు. హింస ఆపలేని వారు తమ పదవులకు రాజీనామా చేయాలంటూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్‌గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్‌మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?