నిర్భయ కేసు: నేడు సుప్రీం విచారణ..!

దిల్లీ: నిర్భయ కేసులో నలుగురు దోషులకు రేపు(మార్చి 3) ఉరితీయాలని దిల్లీ కోర్టు డెత్‌ వారెంట్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే దోషుల్లో ఒకరైన పవన్‌ గుప్తా తన మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని సుప్రీంకోర్టులో క్యురేటివ్‌ పిటిషన్‌  దాఖలు చేశారు.

Updated : 02 Mar 2020 10:56 IST

దిల్లీ: నిర్భయ కేసులో నలుగురు దోషులకు రేపు ఉరితీయాలని దిల్లీ కోర్టు డెత్‌ వారెంట్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే దోషుల్లో ఒకరైన పవన్‌ గుప్తా తన మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని సుప్రీంకోర్టులో క్యురేటివ్‌ పిటిషన్‌  దాఖలు చేశారు.  దీంతోపాలు ట్రయల్‌ కోర్టు ఇచ్చిన డెత్‌ వారెంట్లపై స్టే విధించాలని అతడి తరపున న్యాయవాది ఏపీ సింగ్‌ పిటిషన్ వేశారు. దీనిపై సుప్రీంకోర్టు బెంచ్‌ ఈరోజు ప్రత్యేకంగా విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ రమణ, అరుణ్ మిశ్రా, ఆర్‌ఎఫ్‌ నారిమన్‌, భానుమతి, అశోక్‌ భూషన్‌తో కూడిన ధర్మాసనం నేడు వాదనలు విననుంది. నిర్భయ దోషుల్లో ఇప్పటివరకు ముగ్గురు తమ న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకోగా, పవన్‌ గుప్తా ఒక్కడే ఇప్పటివరకు వినియోగించుకోలేదు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని