మేమూ శాంతినే కోరుకుంటున్నాం.. కానీ 

ఈశాన్య దిల్లీ అల్లర్లకు ముందు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన రాజకీయ నేతలు, ఇతరులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలంటూ దాఖలైన పిటషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. మార్చి 4 బుధవారం దీనిపై విచారణ

Updated : 02 Mar 2020 14:03 IST

దిల్లీ అల్లర్ల ఘటనపై విచారణకు సుప్రీం అంగీకారం

దిల్లీ: ఈశాన్య దిల్లీ అల్లర్లకు ముందు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన రాజకీయ నేతలు, ఇతరులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలంటూ దాఖలైన పిటషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. మార్చి 4వ తేదీన బుధవారం దీనిపై విచారణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. 

విద్వేష ప్రసంగాలకు పాల్పడిన భాజపా నేతలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణను దిల్లీ హైకోర్టు ఇటీవల ఏప్రిల్‌ 30వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే. దీంతో అల్లర్ల బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు అంశంపై సత్వర విచారణ చేపట్టాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది కోలిన్‌ గోన్సాల్వ్స్‌ వాదనలు వినిపించారు. 

దిల్లీ అల్లర్లలో ఇంకా చాలా మంది ప్రజలు చనిపోతున్నారని తెలిసినా.. దిల్లీ హైకోర్టు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేయడం విచారకరమని కోలిన్‌ సర్వోన్నత న్యాయస్థానానికి వెల్లడించారు. ఇందుకు సీజేఐ బోబ్డే ధర్మాసనం స్పందిస్తూ.. ‘వార్తాపత్రికల ద్వారా దిల్లీ పరిస్థితిని తెలుసుకున్నాం. మేము కూడా శాంతినే కోరుకుంటున్నాం. కానీ, మాకూ కొన్ని పరిమితులు ఉంటాయని మీకు తెలుసు కదా’ అని వ్యాఖ్యానించింది. నేతల ఎఫ్‌ఐఆర్‌ నమోదుపై మంగళవారం విచారణ జరపాలని న్యాయవాది కోరగా.. బుధవారం విచారిస్తామని కోర్టు స్పష్టం చేసింది. 


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని