ఆ పాన్‌కార్డు వాడితే 10వేలు జరిమానా..!

దిల్లీ: ఆధార్‌తో అనుసంధానం చేయని పాన్‌ కార్డులను వినియోగిస్తే పదివేల రూపాయల జరిమానా విధించే అవకాశం ఉందని ఆదాయపుపన్ను శాఖ తాజాగా ప్రకటించింది. మార్చి 31నాటికి ఆధార్‌తో లింక్‌ చేయని పాన్‌కార్డులను పనిచేయని వాటిగా పరిగణిస్తామని ఇదివరకే ఆదాయపుపన్ను శాఖ వెల్లడించింది.

Published : 03 Mar 2020 00:36 IST

ఆధార్‌ లింక్‌ చేయని పాన్‌కార్డు వాడితే 10వేలు జరిమానా

దిల్లీ: ఆధార్‌తో అనుసంధానం చేయని పాన్‌కార్డులను వినియోగిస్తే పదివేల రూపాయల జరిమానా విధించే అవకాశం ఉందని ఆదాయపుపన్ను శాఖ తాజాగా ప్రకటించింది. మార్చి 31నాటికి ఆధార్‌తో లింక్‌ చేయని పాన్‌కార్డులను పనిచేయని వాటిగా పరిగణిస్తామని ఇదివరకే ఆదాయపుపన్ను శాఖ వెల్లడించింది. గడువు తేదీలోపు పాన్‌కార్డుకు ఆధార్‌ అనుసంధానించని వినియోగదారులపై ఆదాయపుపన్ను చట్టం ప్రకారం న్యాయపరమైన చర్యలు తప్పవని తెలిపింది. ఐటీ చట్టంలోని సెక్షన్‌ 272B ప్రకారం రద్దైన పాన్‌ కార్డు వాడినవారికి 10వేల రూపాయల జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది.

ఆదాయపుపన్ను చట్టంలోని సెక్షన్‌139 ప్రకారం, జూలై1, 2017ముందు కార్డు పొందిన వ్యక్తి కచ్చితంగా తన ఆధార్‌ నెంబరును ఐటీశాఖ అధికారుకు తెలపాల్సి ఉంటుంది. ఇప్పటికే 31 మార్చి2020ను గడువు తేదీ విధించిన ఐటీశాఖ, ఏప్రిల్‌ ఒకటినుంచి అలాంటి పాన్‌కార్డును పనిచేయనిదిగా పరిగణిస్తామని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌(సీబీడీటీ)ప్రకటన ద్వారా తెలియజేసింది. పాన్‌కార్డును పనిచేయనిదిగా పరిగణిస్తే మాత్రం ఆర్థిక, బ్యాంకింగు, ప్రాపర్టీ కొనుగోలు-అమ్మకాలు, స్టాక్‌ మార్కెట్ల లావాదేవీల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే దీని గడువును పలుమార్లు పొడగించిన ఐటీశాఖ..ఈసారి మాత్రం గడువుతేదీ పొడగించే అవకాశం లేదని తెలుస్తోంది.

అయితే, గడువుతేదీ ముగిసిన అనంతరం కూడా పాన్‌కార్డుతో ఆధార్‌ అనుసంధానం చేసే వీలుంది. ఆధార్‌ లింక్‌ చేసినప్పటినుంచి తిరిగి అదే పాన్‌కార్డును పనిచేసేదిగా పరిగణిస్తారు.

ఆధార్‌-పాన్‌కార్డు అనుసంధానం ఇలా..

* ఆదాయపుపన్ను శాఖ ‘ఈఫైలింగ్‌’ పోర్టల్‌ సాయంతో ఆధార్‌ను అనుసంధానం చేసుకోవచ్చు. www.incometaxindiaefiling.gov.in వెబ్‌సైట్‌లో ఎడమవైపున ఉన్న Link Aadhaar విభాగంపై క్లిక్‌ చేసి ఆధార్‌, పాన్‌ వివరాలు తెలపవచ్చు.

* అనుసంధానం కోసం ఎస్‌ఎంఎస్‌ సౌకర్యం కూడా కల్పించింది. ఇందుకోసం 567678 లేదా 56161కు ‘UIDPAN స్పేస్‌ 12-digit-Aadhaar స్పేస్‌ 10-digit-PAN’ టైపు చేసి మెసేజ్‌ చేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని