నిర్భయ కేసు: ‘ఉరి’ స్టేపై మరోసారి విచారణ
నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషుల ఉరితీతపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో డెత్ వారెంట్లపై స్టే ఇచ్చేందుకు కొద్ది సేపటి క్రితం దిల్లీ పటియాల హౌస్ కోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే అంశంపై
పవన్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
దిల్లీ: నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషుల ఉరితీతపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో డెత్ వారెంట్లపై స్టే ఇచ్చేందుకు కొద్ది సేపటి క్రితం దిల్లీ పటియాల హౌస్ కోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే అంశంపై న్యాయస్థానం మరోసారి విచారణ చేపట్టి తీర్పును రిజర్వ్‌లో పెట్టింది.
ఉరిశిక్షపై తాను మరోసారి రాష్ట్రపతికి క్షమాభిక్ష అభ్యర్థన పెట్టుకున్నానని, అందువల్ల డెత్ వారెంట్‌పై స్టే ఇవ్వాలని కోరుతూ దోషుల్లో ఒకడైన అక్షయ్ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన పటియాల హౌస్ కోర్టు అక్షయ్ అభ్యర్థనను కొట్టివేసింది. రేపటి ఉరితీతపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. అయితే ఇదే సమయంలో మరో దోషి పవన్ గుప్తా కూడా పిటిషన్ దాఖలు చేశాడు.
ఉరితీత సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో పవన్ గతవారం సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేయగా.. నేడు సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో అతడు రాష్ట్రపతికి క్షమాభిక్ష అభ్యర్థన పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని దోషి తరఫు న్యాయవాది ఏపీ సింగ్ దిల్లీ కోర్టు దృష్టికి తెచ్చారు. క్షమాభిక్ష అభ్యర్థన రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న దృష్ట్యా ఉరితీతపై స్టే ఇవ్వాలని పవన్ న్యాయస్థానాన్ని కోరాడు.
అయితే పవన్ అభ్యర్థనపై దిల్లీ కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. క్యురేటివ్, క్షమాభిక్ష పిటిషన్లు పెట్టుకోడానికి ఎందుకు ఆలస్యం చేశారని దోషి తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ఒక వ్యక్తి చేసే తప్పుడు చర్య వల్ల ఎలాంటి పరిణామాలు వస్తాయో మీకు తెలియదా అంటూ న్యాయవాదిని నిలదీసింది. మరోవైపు పవన్ పిటిషన్‌పై తిహాడ్ అధికారులు స్పందిస్తూ.. ‘ఇప్పుడు బంతి ప్రభుత్వం చేతిలో ఉంది.. న్యాయమూర్తి చేయాల్సింది ఏమీ లేదు’ అని వ్యాఖ్యానించారు. వాదనల అనంతరం పవన్ పిటిషన్‌పై దిల్లీ కోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టింది.
హోంశాఖకు చేరిన క్షమాభిక్ష
ఇదిలా ఉండగా.. పవన్ పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థన కేంద్ర హోంశాఖకు చేరింది. దీన్ని హోంశాఖ రాష్ట్రపతికి సిఫార్సు చేయాల్సి ఉంటుంది.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్‌ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
4 వాంగ్మూలాలతో సీఎం అరెస్టా?
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని అణచివేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రయత్నిస్తోందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. -
నిరంతర ప్రేరణ శక్తి.. స్వామి స్మరణానంద
రామకృష్ణమఠం, రామకృష్ణ మిషన్లకు 16వ అధిపతిగా ఉన్న స్వామి స్మరణానంద కన్నుమూత తనను నిర్ఘాంతపరిచిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. -
న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లకు కుతంత్రాలు
న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లు తీసుకువచ్చి, న్యాయస్థానాల ప్రతిష్ఠను మసకబార్చేందుకు ‘స్వార్థ ప్రయోజనాలతో కూడిన ఒక బృందం’ ప్రయత్నాలు చేస్తోందని 600 మందికిపైగా న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌కు ఉమ్మడిగా లేఖ రాశారు. -
దిల్లీ హైకోర్టులోనూ కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ
ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్‌నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
దేశం అప్పు రూ.160 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వ అప్పులు గత డిసెంబరు నాటికి రూ.160.69 లక్షల కోట్లకు చేరాయి. గత సెప్టెంబరు నాటికి రూ.157.84 లక్షల కోట్లు ఉన్న అప్పులు డిసెంబరు నాటికి మరింత పెరిగాయి. -
ఉపాధిహామీ వేతనాల సవరణ
ఉపాధిహామీ పథకం కింద చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. రాష్ట్రాలవారీగా 4 నుంచి 10 శాతం మేర ఇవి పెరిగాయి. -
ఈడీ విచారణకు మహువా గైర్హాజరు
విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో దిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో గురువారం నాటి విచారణకు తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా గైర్హాజరయ్యారు. -
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
గ్యాంగ్‌స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్