నిర్భయ దోషి క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణ

నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషి పవన్‌ గుప్తా పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరస్కరించారు. నిర్భయ దోషులను రేపు ఉరితీసేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా.. శిక్ష అమలును

Updated : 02 Mar 2020 16:53 IST

దిల్లీ: నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషి పవన్‌ గుప్తా పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరస్కరించారు. నిర్భయ దోషులను రేపు ఉరితీసేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా.. శిక్ష అమలును ఆపేందుకు దోషులు అనేక ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నలుగురు దోషుల్లో ఒకడైన పవన్‌ గుప్తా గతవారం సుప్రీంకోర్టులో క్యురేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. దీన్ని న్యాయస్థానం నేడు కొట్టివేసింది. దీంతో అతడు చిట్టచివరి అవకాశంగా క్షమాభిక్ష దరఖాస్తు పెట్టుకున్నాడు. ఈ పిటిషన్‌ను కేంద్ర హోంశాఖ రాష్ట్రపతికి పంపగా.. పవన్‌ క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరస్కరించారు. 

మరోవైపు క్షమాభిక్ష అభ్యర్థన పెండింగ్‌లో ఉన్న దృష్ట్యా ఉరితీతపై స్టే ఇవ్వాలని కోరుతూ పవన్‌ దిల్లీ పటియాల హౌస్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన ట్రయల్‌ కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మీరు నిప్పుతో చెలగాటమాడుతున్నారంటూ దోషి తరఫు న్యాయవాదిని హెచ్చరించింది. వాదనల అనంతరం తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. మరికాసేపట్లో ఉరి స్టేపై దిల్లీ కోర్టు తీర్పు వెలువరించనుంది.

ఇదీ చదవండి..

‘ఉరి’ స్టేపై మరోసారి విచారణ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని