ఇంకెప్పుడు ఉరి తీస్తారు: నిర్భయ తల్లి

నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు విషయంలో పటియాలా కోర్టు మరోసారి స్టే వేయడంపై బాధితురాలి తల్లి ఘాటుగా స్పందించారు. ఉరిశిక్ష అమలు ప్రక్రియ పదేపదే వాయిదా వేయడం..

Published : 03 Mar 2020 00:21 IST

దిల్లీ: నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు విషయంలో పటియాలా హౌస్‌ కోర్టు మరోసారి స్టే విధించడంపై బాధితురాలి తల్లి ఘాటుగా స్పందించారు. ఉరిశిక్ష అమలు ప్రక్రియ పదేపదే వాయిదా వేయడం.. మన వ్యవస్థ వైఫల్యాన్ని చూపిస్తోందని అన్నారు. నిర్భయ దోషులకు రేపు విధించాల్సిన ఉరిశిక్షపై పటియాలా హౌస్‌ కోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. దీనిపై నిర్భయ తల్లి స్పందిస్తూ.. న్యాయస్థానం తాను ఇచ్చిన తీర్పును అమలు చేయడానికి ఎందుకింత సమయం తీసుకుంటోందన్నారు. దోషులకు శిక్ష ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. నిర్భయ దోషులకు మార్చి 3న ఉదయం ఉరి తీయాల్సి ఉంది. ఈ క్రమంలో తమ డెత్ వారెంట్లపై స్టే ఇవ్వాలంటూ దోషుల్లో ఒకరైన పవన్‌ గుప్తా పిటిషన్‌ దాఖలు చేశాడు. దీనిపై విచారణ విచారణ జరిపిన న్యాయస్థానం స్టే విధించింది.

ఇదీ చదవండి..

నిర్భయ దోషుల ఉరి అమలుపై స్టే


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని