దేశంలో మరో కరోనా కేసు నమోదు!

ఇటలీ నుంచి జైపూర్‌కు వచ్చిన ప్రయాణికుడికి సోమవారం కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తేలిందని రాజస్థాన్‌ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అతడి రక్త నమూనాలను మరోసారి పరీక్షించేందుకు పుణెలోని ఎన్‌ఐవీకి పంపినట్లు తెలిపారు.

Published : 02 Mar 2020 20:01 IST

జైపూర్‌: ఇటలీ నుంచి జైపూర్‌కు వచ్చిన ప్రయాణికుడికి సోమవారం కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తేలిందని రాజస్థాన్‌ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అతడి రక్త నమూనాలను మరోసారి పరీక్షించేందుకు పుణెలోని ఎన్‌ఐవీకి పంపినట్లు తెలిపారు. రాజస్థాన్‌ ఆరోగ్య శాఖ మంత్రి రఘు శర్మ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఫిబ్రవరి 29న ఇటలీ నుంచి జైపూర్‌ వచ్చిన ప్రయాణికుడిని స్క్రీనింగ్ నిర్వహించగా కరోనా లక్షణాలున్నట్లు తేలింది. దీంతో అతడిని ఐసోలేషన్‌ వార్డుకు పంపించాం. అనంతరం మొదటిసారి పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌గా తేలింది. సోమవారం మరోసారి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్దారణైంది. రెండు సార్లు వేర్వేరుగా ఫలితం రావడంతో అతడి రక్త నమూనాలను మరోసారి పరీక్షించేందుకు పుణెలోని ఎన్‌ఐవీకి పంపించాం. ఫిబ్రవరి 29న ఆ వ్యక్తికి దగ్గరగా ఉన్న వారిని సైతం స్క్రీనింగ్‌ చేస్తున్నాం. ప్రస్తుతం అతడిని జైపూర్‌లోని ఆస్పత్రిలో ఐసోలేషన్‌ వార్డులో ఉంచాం’ అని తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని