నేడు మోదీని కలవనున్న కేజ్రీవాల్‌

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నేడు ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత ప్రధానిని కలవడం ఇదే తొలిసారి.........

Published : 03 Mar 2020 09:08 IST

దిల్లీ: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నేడు ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత ప్రధానిని కలవడం ఇదే తొలిసారి. అలాగే ఇటీవల ఈశాన్య దిల్లీలో ఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో వీరివురి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. గత వారం దిల్లీ అల్లర్లకు సంబంధించి అమిత్‌ షాతో కేజ్రీవాల్‌ భేటీ అయి చర్చించారు. ఈ సందర్భంగా రాజకీయాలను పక్కనబెట్టి దిల్లీ ప్రభుత్వానికి కేంద్ర తరఫున అన్ని రకాల సహాయసహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని షా హామీ ఇచ్చినట్లు కేజ్రీవాల్‌ తెలిపారు. ఈ ఘర్షణల్లో 46 మంది ప్రాణాలు కోల్పోగా.. 200 మంది తీవ్రంగా గాయపడ్డారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని