చైనా వెలుపల కరోనా ఉగ్రరూపం..!

జనీవా: గత కొన్నిరోజులుగా చైనాను వణికిస్తున్న కరోనా వైరస్‌, ప్రస్తుతం ప్రపంచ దేశాలను కకావికలం చేస్తోంది. చైనాలో విజృంభించినదానికంటే అత్యధిక వేగంతో ప్రస్తుతం కరోనా వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెల్లడించింది. కేవలం గడిచిన 24గంటల్లో చైనాలో కన్నా ఆ దేశం వెలుపల నమోదవుతున్న కేసుల సంఖ్య 8రెట్లు ఎక్కువగా ఉండటం తీవ్ర ఆందోళన చెందాల్సిన విషయమని డబ్ల్యూహెచ్‌ఓ డైరక్టర్‌ జనరల్‌ టెడ్రాస్‌ అధానోమ్‌ గెబ్రెయేసస్‌ పేర్కొన్నారు.   

Updated : 03 Mar 2020 11:49 IST

మరణాల సంఖ్య పెరగడంపై డబ్ల్యూహెచ్‌ఓ ఆందోళన

జనీవా: గత కొన్నిరోజులుగా చైనాను వణికిస్తోన్న కరోనా వైరస్‌(కొవిడ్‌-19) ప్రస్తుతం ప్రపంచ దేశాలను కకావికలం చేస్తోంది. చైనాలో విజృంభించిన దానికంటే మరింత వేగంగా ప్రస్తుతం కరోనా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెల్లడించింది. కేవలం గడిచిన 24గంటల్లో చైనాలో కన్నా ఆ దేశం వెలుపల నమోదవుతున్న కేసుల సంఖ్య 8రెట్లు ఎక్కువగా ఉండటం తీవ్ర ఆందోళన చెందాల్సిన విషయమని డబ్ల్యూహెచ్‌ఓ డైరక్టర్‌ జనరల్‌ టెడ్రాస్‌ అధానోమ్‌ గెబ్రెయేసస్‌ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రత అధికంగా ఉందని, మరణాల సంఖ్య మరింత పెరగడం తీవ్ర ఆందోళనకర విషయమన్నారు. ఇప్పటికే దక్షిణకొరియా, ఇటలీ, ఇరాన్‌తో పాటు జపాన్‌లో దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉందన్నారు.  

దీంతో పాటు అమెరికాలో కూడా కరోనా ప్రభావంతో ఇప్పటికే ఆరుగురు మరణించగా దాదాపు 91 కేసులు నమోదయ్యాయి. అయితే కరోనానను గుర్తిచేందుకు తమ దగ్గర అన్ని వసతులు ఉన్నాయని అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ తెలిపింది. ఈ ఒక్క వారంలోనే దాదాపు పదిలక్షల మందిని పరీక్షించేందుకు కావాల్సిన వనరులు తమ దగ్గర ఉన్నాయని పేర్కొంది. అయితే పరీక్షలు నిర్వహించేకొద్ది కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సీనియన్‌ అధికారి అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో ఊహించినదానికంటే ఎక్కువ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా భారినపడి 3వేల మందికిపైగా మరణించగా..86వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇటలీలో కూడా ఈ మరణాల సంఖ్య ఏకంగా18నుంచి 52కు చేరింది. ఇరాన్‌లో దాదాపు 66మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, దక్షిణకొరియాలో 26మంది మరణించారు. ఇప్పటికి చైనా వెలుపల మొత్తం 8700 కేసులు నమోదుకాగా మరణాల సంఖ్య 130 దాటింది.

చైనాలో తగ్గిన తీవ్రత 

కరోనాకు కేంద్రంగా భావిస్తున్న వుహాన్‌ నగరంలో మాత్రం కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య తగ్గిందని అక్కడి అధికారిక మీడియా పేర్కొంది. దీంతో కరోనా చికిత్సకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆసుపత్రుల్లో కొన్నింటిని మూసివేస్తున్నట్లు వెల్లడించింది. వుహాన్ సమీప ప్రాంతమైన హూబేలో కూడా వీటి సంఖ్య తగ్గింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని